Telugu Global
Cinema & Entertainment

Allu Arjun - అర్జున్ రెడ్డి దర్శకుడితో అల్లు అర్జున్

Allu Arjun Sandeep Reddy Vanga - అల్లు అర్జున్ తో అర్జున్ రెడ్డి డైరక్టర్ సినిమా లాక్ అయింది. టీ-సిరీస్ బ్యానర్ పై వస్తుంది.

Allu Arjun - అర్జున్ రెడ్డి దర్శకుడితో అల్లు అర్జున్
X

పుష్ప సక్సెస్ తో బన్నీ ఆలోచనలు మారిపోయాయి. ఏ సినిమా చేసినా పాన్ ఇండియా లెవెల్లో ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన కొత్త సినిమాను ప్రకటించాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్‌తో ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా ఓ సినిమా తీయబోతున్నాడు. టీ-సిరీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే సందీప్ రెడ్డి సినిమా మొదలవుతుంది. 2025లో ఈ సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్.

మరోవైపు బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సందీప్‌ రెడ్డి. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక హీరోహీరోయిన్లు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. యానిమల్ తర్వాత, ప్రభాస్ తో ‘స్పిరిట్‌’ అనే సినిమా చేస్తాడు సందీప్ రెడ్డి.

ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాత బన్నీ సినిమా సెట్స్‌పైకి వస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర నటీనటుల్ని ఎవ్వర్నీ ఇంకా ఫిక్స్ చేయలేదు.

First Published:  4 March 2023 6:10 AM GMT
Next Story