Telugu Global
Cinema & Entertainment

Allari Naresh: ఈసారి సరదా సినిమాతో అల్లరోడు

Allari Naresh New Movie: అల్లరి నరేష్ మూలాల్లోకి వెళ్లాడు. తనకు పేరు తెచ్చిపెట్టిన కామెడీ జానర్ లో కొత్త సినిమా చేయబోతున్నాడు.

Allari Naresh: ఈసారి సరదా సినిమాతో అల్లరోడు
X

Allari Naresh: ఈసారి సరదా సినిమాతో అల్లరోడు

అల్లరి నరేష్ తన జనరేషన్ హీరోలలో కామెడీ కింగ్. అయితే ఇటీవలి కాలంలో భిన్నమైన పంథాను అనుసరించి తాను కామెడీతో పాటు ఇంటెన్స్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ తన పాత పంథాలోకి మారాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో, కామెడీ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడంతో పాటు, మూవీని కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు.

ఈ ఓపెనింగ్ లో యంగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ నాగ్ అశ్విన్ చేశాడు. జెమినీ కిరణ్, శరత్ మరార్ స్క్రిప్ట్ అందజేశారు. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో హీరోయిన్. నరేష్, ఫరియాల కలయికలో వస్తున్న మొదటి సినిమా ఇది.

ఇది చాలా మంచి కామెడీ ఎంటర్ టైనర్ అంటున్న అల్లరి నరేష్... ప్రేక్షకులు తన నుంచి కోరుకునే ఫన్, ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా అన్నీ ఇందులో ఉంటాయని చెబుతున్నాడు. ఏప్రిల్ 10 నుంచి మూవీ ఫస్ట్ షెడ్యుల్ స్టార్ట్ అవుతుంది. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  23 March 2023 2:56 PM GMT
Next Story