Telugu Global
Cinema & Entertainment

Aditya 999: ఇంకా ఆశలు వీడలేదా?

Aditya999: ఈ 3వస్తుందో రాదో తెలియదు కానీ, దీనిపై పుకార్లు మాత్రం ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి

Aditya 999: ఇంకా ఆశలు వీడలేదా?
X

ఆదిత్య-999.. ఎప్పటికప్పుడు బాలయ్య చెబుతూ వస్తున్న సినిమా ఇది. ఆదిత్య-369కు సీక్వెల్ గా ఈ సినిమా తీస్తానని ఆయన చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తనే డైరక్ట్ చేస్తానని, మరికొన్ని సందర్భాల్లో తనే హీరోగా నటిస్తానని, ఇంకొన్ని సందర్భాల్లో కథ కూడా తనదేనని, తన కొడుకు హీరో అని చెబుతూ వస్తున్నారు బాలయ్య.


అయితే ఏళ్లుగా ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆదిత్య-999పై ఊహాగానాలు రావడం, చల్లారిపోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా తెరపైకొచ్చింది.


2023లో ఈ ప్రాజెక్టును ప్రకటించడానికి మంచి ముహూర్తం సెట్ అయిందంట. మరీ ముఖ్యంగా ప్రాజెక్టును ప్రకటించడానికి ఫిబ్రవరిలో దివ్యమైన ముహూర్తం ఉందంట. ఈ మేరకు ఆల్రెడీ బాలయ్య ఓ తేదీని ప్రకటించారంటూ కథనాలు వస్తున్నాయి.


వీరసింహారెడ్డి సినిమాను విడుదలకు సిద్ధం చేసిన బాలయ్య, అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాకు ప్రిపేర్ అవుతున్నారు. ఆ మూవీ చేస్తూనే, మరోవైపు ఆదిత్య999ను ఆయన స్టార్ట్ చేస్తారా లేక మళ్లీ గ్యాప్ ఇస్తారా అనేది చూడాలి.

First Published:  30 Dec 2022 8:03 AM GMT
Next Story