Telugu Global
Cinema & Entertainment

Actor Venkat - మళ్లీ హీరోగా మారిన వెంకట్

Actor Venkat - సీనియర్ నటుడు వెంకట్ మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈసారి పోలీస్ గెటప్ వేశాడు.

Actor Venkat - మళ్లీ హీరోగా మారిన వెంకట్
X

నటుడు వెంకట్ గుర్తున్నాడా..? అప్పుడెప్పుడో వచ్చిన ఆనందం సినిమాలో సెకెండ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత సీతారాముల కల్యాణం చూతమురారండి లాంటి సినిమాలు చేశాడు. ఆ తర్వాత పూర్తిగా తెరమరుగయ్యాడు. మళ్లీ ఈమధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సుశాంత్ హీరోగా నటించిన ఓ మూవీలో విలన్ గా నటించాడు. ఇప్పుడు మరోసారి హీరో అయ్యాడు.

మైత్రీ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజ్ తాళ్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి నటుడు అలీ, నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకులు వైవిఎస్. చౌదరి, వేణు ఉడుగుల, శివబాలాజీ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

క్రైం కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో వెంకట్, రవిందర్ రెడ్డి, ఆదిత్య, మహేష్ విట్ట, వెంకట్, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ నటిస్తున్నారు. త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

ఈ నెల 10నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా తనకు కచ్చితంగా రీఎంట్రీ మూవీ అవుతుందంటున్నాడు వెంకట్. ఇందులో అతడు పోలీస్ గా కనిపించనున్నాడు.

First Published:  30 April 2023 5:23 PM GMT
Next Story