Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ2 కోసం వినూత్న ప్రచారం

కార్తికేయ2 సినిమా ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నాడు హీరో నిఖిల్. కార్తికేయ క్వెస్ట్ పేరిట ట్రెజర్ హంట్ పెట్టాడు.

కార్తికేయ2 కోసం వినూత్న ప్రచారం
X

నిఖిల్ హీరోగా, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై అద్భుతమైన స్పందన వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మధ్యే కార్తికేయ 2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న విడుదల కానుంది కార్తికేయ 2 సినిమా.

తాజాగా ఈ సినిమాకు వినూత్నమైన ప్రచారం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. దీని కోసం సెపరేటుగా ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. దీని పేరు కార్తికేయ క్వెస్ట్.

అచ్చమైన బంగారంతో చేసిన కృష్ణుని ప్రతిమల్ని ఈ 4 నగరాల్లోని కొన్ని రహస్య ప్రదేశాల్లో ఉంచారు. వాటిని కనిబెట్టేందుకు క్లూస్ ఇస్తున్నారు. క్లూస్ ఆధారంగా విగ్రహాన్ని కనిబెడితే.. ఆ బంగారు విగ్రహాలు వాళ్ల సొంతం అవుతాయి.

ఇప్పటికే హైదరాబాదులో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

First Published:  1 Aug 2022 2:26 AM GMT
Next Story