Telugu Global
Cinema & Entertainment

'వీరమల్లు' సినిమాలో కీలక మార్పు

పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోకి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ వచ్చి చేరాడు. దీంతో మరికొన్ని పుకార్లు ఊపందుకున్నాయి

వీరమల్లు సినిమాలో కీలక మార్పు
X

తాజాగా సెట్స్ పైకొచ్చింది హరిహర వీరమల్లు సినిమా. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎట్టకేలకు ఓ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అయితే ఓవైపు సినిమా షూటింగ్ నడుస్తుంటే, మరోవైపు ప్రాజెక్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకుంది.

అవును.. పవన్ కల్యాణ్ సినిమాలోకి సీనియర్ నటుడు బాబి డియోల్ వచ్చి చేరాడు. ఈ బాలీవుడ్ నటుడి రాకతో సినిమాకు సంబంధించి అనుమానాలు ఎక్కువయ్యాయి.

హరిహర వీరమల్లు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. సినిమాలో అతడు ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు సడెన్ గా బాబీ డియోల్ వచ్చి చేరడంతో, అర్జున్ రాంపాల్ ను తప్పించారనే పుకార్లు అందుకున్నాయి.

నిజంగానే బాబీడియోల్, అర్జున్ రాంపాల్ స్థానంలోకి వచ్చాడా లేక ఓ కొత్త రోల్ కోసం బాబి డియోల్ ను కూడా తీసుకున్నారా అనే అంశంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను తీసుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాలో ఉందా లేదా అనే అంశంపై యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.




First Published:  29 Oct 2022 12:09 PM GMT
Next Story