Telugu Global
Cinema & Entertainment

ARI Movie - అరి మూవీపై కన్నేసిన అభిషేక్

ARI Movie - జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది అరి మూవీ. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్ లో అభిషేక్ బచ్చన్ నటించే అవకాశం ఉంది.

ARI Movie - అరి మూవీపై కన్నేసిన అభిషేక్
X

అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాల్సిన పనిలేదు.. ఒక్క మెతుకు పట్టుకుంటే పదును తెలిసిపోతుంది. ‘పేపర్ బాయ్’ తో హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘అరి’ చిత్రం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేట్టు చేశారు యువ దర్శకుడు జయ శంకర్. ఇప్పుడీ సినిమాకు విడుదలకు ముందే హిందీ రీమేక్ కన్ ఫర్మ్ అయిందని టాక్.

యూనివర్సల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ మూవీ ని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కి చూపించారు డైరెక్టర్ జయశంకర్. సినిమా కాన్సెప్ట్ అభిషేక్ బచ్చన్ కి బాగా నచ్చింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే నటిస్తానంటూ, వెంనటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

దీంతో అరి యూనిట్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. అభిషేక్ బచ్చన్ లాంటి హీరో సినిమా గురించి ఇలా విడుదలకు ముందే పాజిటివ్ గా మాట్లాడ్డం, యూనిట్ కు మరింత నమ్మకం పెంచింది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే, హిందీ రీమేక్ కు కూడా జయశంకర్ డైరెక్టర్ గా ఉంటారు.

అరి సినిమాకు 'మై నేజ్ ఈజ్ నో బడీ' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ట్రైలర్ కి, మంగ్లీ పాడిన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు వెంకయ్య నాయుడు, చినజీయర్ స్వామి, కిషన్ రెడ్డి, అశ్వనీదత్ లాంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు. కృష్ణతత్వంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఇస్కాన్ కూడా మద్దతు తెలిసింది. ఆగస్ట్ లో వస్తోంది అరి.

First Published:  11 Jun 2023 11:19 AM GMT
Next Story