Telugu Global
Cinema & Entertainment

Salaar | ఒక్క ఎపిసోడ్ కోసం 750 వాహనాలు

Salaar Movie | సలార్ లో ఓ యాక్షన్ సీన్ కోసం భారీగా వాహనాలు అవసరమయ్యాయి. దీంతో ఏకంగా 750 ట్రక్కులు తెప్పించారు.

Salaar | ఒక్క ఎపిసోడ్ కోసం 750 వాహనాలు
X

Salaar | ఒక్క ఎపిసోడ్ కోసం 750 వాహనాలు

Salaar Movie | ‘సలార్‌’ విడుదలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 50 రోజుల్లో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ తో పాటు సాంగ్స్ ను ఇంకా మేకర్స్ విడుదల చేయలేదు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ వెయిటింగ్ కు తగిన ఫలితం దక్కుతుందని చెబుతున్నాడు.

ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా సలార్. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్‌గా, జగపతి బాబు మరో విలన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సలార్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట.

ఇప్పుడీ యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సినిమాలో ఓ సీన్ కోసం భారీ సంఖ్యలో జీపులు, ట్రక్కులు కావాల్సి వచ్చింది. ఆ ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా 750 వాహనాలను ఉపయోగించారట. ఇలాంటి ఎన్నో భారీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది.

రీసెంట్ గా సలార్ సినిమాపై హీరోయిన్ శృతిహాసన్ మరోసారి స్పందించింది. సలార్ ప్రపంచం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకొచ్చింది. స్క్రిప్ట్ ఎంత భారీగా ఉందో, సినిమా కోసం వేసిన సెట్స్ కూడా అంతే భారీగా ఉన్నాయని తెలిపింది. మరోవైపు సలార్ యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తింది. తనను బాగా చూసుకున్నారని, అందరం ఓ ఫ్యామిలీలా కనిసిపోయామని అంటోంది. సలార్ పార్ట్-1, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది.

First Published:  4 Nov 2023 6:58 AM GMT
Next Story