Telugu Global
Business

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్! వీటిపై మంచి ఆఫర్లు!

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్‌లో గిఫ్ట్ ఆర్టికల్స్‌పై 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ప్రీమియం చాక్లెట్స్, జువెల్లరీ పై 40 నుంచి 70 శాతం డిస్కౌంట్స్ ఉన్నాయి.

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్! వీటిపై మంచి ఆఫర్లు!
X

వాలంటైన్స్ డే సందర్భంగా తమ పార్ట్‌నర్స్‌కు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు చాలామంది. ఈ సందర్భంగా ఆమెజాన్ పలు ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు ప్రకటించింది. ఇందులో మొబైల్స్, స్మార్ట్ వాచీలతో పాటు పలు ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి.

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్‌లో గిఫ్ట్ ఆర్టికల్స్‌పై 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ప్రీమియం చాక్లెట్స్, జువెల్లరీ పై 40 నుంచి 70 శాతం డిస్కౌంట్స్ ఉన్నాయి. వీటితోపాటు మొబైల్స్‌పై 40 శాతం, స్మార్ట్ వాచీలపై 60 శాతం డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని బెస్ట్ ప్రొడక్ట్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

వాలంటైన్స్ డే స్పెషల్ సేల్‌లో భాగంగా పోకో ఫోన్స్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. రూ. 10,999 ధర ఉన్న ‘పోకో సీ 51’ మొబైల్ రూ. 5,999కే అందుబాటులో ఉంది. అలాగే ‘పోకో సీ 55’ మొబైల్ అసలు ధర రూ.13,999 కాగా వాలంటైన్స్ డే సేల్‌లో ఇది రూ. 7.299కే లభిస్తోంది.

వాలంటైన్స్ డే సేల్‌లో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ’ మొబైల్ రూ. 10,990 కు లభిస్తుంది. కాగా దీని అసలు ధర రూ. 17,999 ఉంది. అలాగే ‘రియల్‌మీ నార్జో 60ఎక్స్’ మొబైల్ అసలు ధర రూ. 15,999 కాగా డిస్కౌంట్‌లో రూ. 12,499కి లభిస్తోంది.

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్‌లో ‘బోట్ బాస్‌హెడ్స్ 100’ హెడ్ ఫోన్స్ 65 శాతం డిస్కౌంట్‌తో రూ. 349కే లభిస్తుంది. కాగా దీని అసలు ధర రూ.999 ఉంది. అలాగే ‘జేబీఎల్ సీ100’ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ధర రూ. 1299 కాగా 54 శాతం తగ్గింపుతో రూ. 599కే అందుబాటులో ఉంది.

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్‌లో భాగంగా ఫుజిఫిల్మ్ ఇన్‌స్టా కెమెరాలపై 30 శాతం డిస్కౌంట్ ఉంది. రూ. 8,499 ధర కలిగిన ‘ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాఎక్స్‌ మినీ 11’ కెమెరా రూ. 5,999కే లభిస్తోంది. ఈ కెమెరాలతో ఫోటో తీస్తే వెంటనే చిన్న ప్రింట్ రూపంలో ఫోటో కాపీ బయటకొస్తుంది. గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇవి బాగుంటాయి. ఇక వీటితోపాటు హ్యాండ్ బ్యాగ్స్, స్విస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, బుక్స్, గ్రూమింగ్ గిఫ్ట్ సెట్స్, క్లాతింగ్ వంటి కేటగిరీలపై కూడా 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి.

First Published:  9 Feb 2024 8:30 AM GMT
Next Story