Telugu Global
Business

Vehicles-TCS | ఆ కార్లు.. మోటారు సైకిళ్లు.. ఈవీ వెహిక‌ల్స్ కొన్నారా.. అయితే టీసీఎస్ పే చేయాల్సిందే.. ఇవీ డిటైల్స్‌..!

Vehicles-TCS | ఏదైనా వ‌స్తువు విక్ర‌యించినా, స‌ర్వీసు పొందినా.. దాని విలువ నిర్ధిష్ట మొత్తం ప‌రిమితి దాటితే కొనుగోలుదారుడి నుంచి విక్రేత ప‌న్ను వ‌సూలు చేయాల‌ని ఆదాయం ప‌న్ను చ‌ట్టం చెబుతోంది. అదే టాక్స్ క‌లెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్‌) అని అంటారు.

Vehicles-TCS | ఆ కార్లు.. మోటారు సైకిళ్లు.. ఈవీ వెహిక‌ల్స్ కొన్నారా.. అయితే టీసీఎస్ పే చేయాల్సిందే.. ఇవీ డిటైల్స్‌..!
X

Vehicles-TCS | ఏదైనా వ‌స్తువు విక్ర‌యించినా, స‌ర్వీసు పొందినా.. దాని విలువ నిర్ధిష్ట మొత్తం ప‌రిమితి దాటితే కొనుగోలుదారుడి నుంచి విక్రేత ప‌న్ను వ‌సూలు చేయాల‌ని ఆదాయం ప‌న్ను చ‌ట్టం చెబుతోంది. అదే టాక్స్ క‌లెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్‌) అని అంటారు.

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో విదేశాల్లో రూ.7 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తే నుంచి 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ నెల ఒక‌టో తేదీ ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంది. మెడిక‌ల్‌, విద్యా సంబంధ‌మైన చెల్లింపులు జ‌రిపితే వేర్వేరు టీసీఎస్ రేట్లు వ‌ర్తిస్తాయి. అలాగే మీరు రూ. 10 ల‌క్ష‌ల‌కు పైగా విలువ గ‌ల మోటార్ వెహిక‌ల్ కొనుగోలు చేస్తే టీసీఎస్ వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ ఎవ‌రైనా తాము కొనుగోలు చేసిన వాహ‌నంపై టీసీఎస్‌ పే చేయ‌లేద‌నుకోండి.. సంబంధిత వాహ‌నాల డీల‌ర్ అసెస్సీ ఇన్ డీఫాల్ట్ (assessee in default) అని క్లాసిఫై చేస్తారు. క‌నుక త‌దుప‌రి రూ.10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ విలువ గ‌ల వాహ‌నం కొనాలంటే టీసీఎస్ చెల్లించ‌కుండా సాధ్యం కాదు.

మోటారు సైకిల్ కొనుగోలు చేస్తే ఒక‌శాతం టీసీఎస్ చెల్లించాలి. ఒక‌వేళ కొనుగోలుదారుడు పాన్ కార్డ్ స‌మ‌ర్పించ‌క‌పోతే 20 శాతం టీసీఎస్ వ‌సూలు చేయాల్సిందే. గ‌త రెండేండ్లుగా ఒక వ్య‌క్తి ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌లేదు. త‌ర్వాత రూ.10 ల‌క్ష‌ల‌పై చిలుకు విలువ గ‌ల వాహ‌నం కొనుగోలు చేస్తే ఐదు శాతం టీసీఎస్ వ‌ర్తిస్తుంది.

ఆదాయం ప‌న్ను చ‌ట్టం-1961 ప్ర‌కారం ఏ మోటారు వాహ‌నానికి టీసీఎస్ వ‌ర్తిస్తుంద‌న్న అంశం నిర్వ‌చించ‌లేదు. మోటారు వాహ‌నాలు అని మోటారు వాహనాల చ‌ట్టం (ఎంవీఏ) కింద ఇచ్చిన నిర్వ‌చ‌నం ఆధారంగా ఆదాయం ప‌న్ను చ‌ట్టం వ‌ర్తిస్తుంది. మోటారు వాహ‌నాల చ‌ట్టం కింద విస్తృత శ్రేణి మోటారు వాహ‌నాలు వ‌స్తాయి. వాటిల్లో కొన్ని వాహ‌నాల‌పై మాత్ర‌మే ఇన్‌కం టాక్స్ యాక్ట్ టీసీఎస్ విధిస్తుంది.

నాలుగు, అంత‌కంటే ఎక్కువ వాహ‌నాలు, ఏ మోటారు సైకిల్‌, ఏ స్కూట‌ర్ అయినా రూ.10 ల‌క్ష‌లు దాటితే టీసీఎస్ నిబంధ‌న వ‌ర్తిస్తుంది. ప్ర‌తి వాహ‌నం ఇంజిన్‌పై క్యూబిక్ కెపాసిటీ (సీసీ) ఎంత అన్న‌ది త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేస్తారు. రూ.10 ల‌క్ష‌ల్లోపు ధ‌ర గ‌ల వాహ‌నం కొన్నా, 25సీసీ కంటే త‌క్కువ కెపాసిటీ గ‌ల వెహిక‌ల్ కొన్నా టీసీఎస్ వ‌ర్తించ‌దు.

`ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ నాలుగు కొన్నా, అంత కంటే త‌క్కువ కొన్నా 25సీసీ కంటే ఎక్కువే. వాటి విలువ రూ.10 ల‌క్ష‌లు దాటితే టీసీఎస్ వ‌ర్తిస్తుంది. అయితే, రూ.10 ల‌క్ష‌ల‌కు పైగా విలువ గ‌ల హై ఎండ్ సైకిళ్ల‌కు టీసీఎస్ నిబంధ‌న వ‌ర్తించ‌దు. ఇంజిన్ ఆధారిత వెహిక‌ల్స్‌పై మాత్ర‌మే టీసీఎస్ వ‌సూలు చేయాల‌ని ఆదాయం ప‌న్ను చ‌ట్టం చెబుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కారు లేదా బైక్ డీల‌ర్ల వ‌ద్ద మోటారు వాహ‌నం కొనుగోలు చేసినా మీ ఇన్‌వాయిస్ విలువ‌లో టీసీఎస్ జ‌త క‌లుస్తుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కొన్నా టీసీఎస్ పే చేయాల్సిందేన‌ని ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 206 (1ఎఫ్‌) చెబుతుంది. విదేశాల నుంచి కారు దిగుమ‌తి చేసుకుంటే మాత్రం.. కొనుగోలుదారుడి నుంచి ఆదాయం ప‌న్ను శాఖ టీసీఎస్ వ‌సూలు చేస్తుంది.

First Published:  21 Oct 2023 8:51 AM GMT
Next Story