Telugu Global
Business

Diwali Car Discounts | దీపావ‌ళికి కారు కొంటున్నారా.. వీటిపై రూ.75 వేల వ‌ర‌కూ ఆదా.. కార్ల త‌యారీ సంస్థ‌ల బంప‌రాప‌ర్లు..!

ఫెస్టివ్ సీజ‌న్‌లోనే కారును సొంతం చేసుకోవాల‌ని అభిల‌షిస్తుంటారు. కార్ల కొనుగోలుదారుల నుంచి భారీగా గిరాకీ ఉండ‌టంతో ప‌లు కార్ల త‌యారీ సంస్థ‌లు ఆక‌ర్ష‌ణీయ డిస్కౌంట్లు, డీల్స్ ఆఫ‌ర్ చేస్తున్నాయి.

Diwali Car Discounts | దీపావ‌ళికి కారు కొంటున్నారా.. వీటిపై రూ.75 వేల వ‌ర‌కూ ఆదా.. కార్ల త‌యారీ సంస్థ‌ల బంప‌రాప‌ర్లు..!
X

Diwali Car Discounts | దీపావ‌ళికి కారు కొంటున్నారా.. వీటిపై రూ.75 వేల వ‌ర‌కూ ఆదా.. కార్ల త‌యారీ సంస్థ‌ల బంప‌రాప‌ర్లు..!

Diwali Car Discounts | భార‌తీయులు దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా త‌మ ఇంట్లోకి ముఖ్య‌మైన‌.. అతిపెద్ద వ‌స్తువులు కొనుగోలు చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఫెస్టివ్ సీజ‌న్‌లోనే కారును సొంతం చేసుకోవాల‌ని అభిల‌షిస్తుంటారు. కార్ల కొనుగోలుదారుల నుంచి భారీగా గిరాకీ ఉండ‌టంతో ప‌లు కార్ల త‌యారీ సంస్థ‌లు ఆక‌ర్ష‌ణీయ డిస్కౌంట్లు, డీల్స్ ఆఫ‌ర్ చేస్తున్నాయి.

దీపావ‌ళి పండుగ‌కే కారు కొనుక్కోవాల‌ని మీరు ప్ర‌ణాళికి వేసుకున్నారా.. అయితే. మీ క‌ల సాకారం కావ‌డానికి ఆయా కార్ల ధ‌ర‌ల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకోండి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్ల ధ‌ర‌లు ప‌రిశీలించుకుని.. మీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా స‌రైన కారు ఎంచుకోవ‌చ్చు. ఈ ప్ర‌క్రియ‌లో మీకు డిస్కౌంట్లు, డీల్స్ ఆఫ‌ర్ చేస్తున్నాయి కార్ల త‌యారీ సంస్థ‌లు. వీట‌న్నింటితో కారు కొనుగోలు మీకు చిర‌స్మ‌ర‌ణీయంగా మారి పోతుంద‌ని చెబుతున్నారు. తొలిసారి కార్ల కొనుగోలు దారులు రూ.8 ల‌క్ష‌ల్లోపు ధ‌ర‌కు సొంతం చేసుకోవ‌చ్చు. ప‌లువురు కొనుగోలుదారుల‌కు ఈ సెగ్మెంట్ చాలా పాపుల‌ర్. ఈ సెగ్మెంట్‌లో కార్ల త‌యారీదారులు, డీల‌ర్లు ఆస‌క్తిక‌ర‌మైన డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు అందిస్తున్నారు. అవేమిటో ఓ లుక్కేద్దాం..

మారుతో ఆల్టో కే10పై రూ.49వేలు డిస్కౌంట్‌

* మారుతి సుజుకి ఆల్టో కే10 మోడ‌ల్ కారుపై రూ.30 వేలు క్యాష్‌బ్యాక్.

* ఎక్స్చేంజ్ ప్ల‌స్ కార్పొరేట్ డిస్కౌంట్ క‌లిపి రూ.15వేల రాయితీ.

మారుతీ ఎస్‌-ప్రెస్సోపై రూ.54,000 డిస్కౌంట్‌

* మారుతి ఎస్‌-ప్రెస్సో మోడ‌ల్ కారుపై రూ.30 వేలు క్యాష్ బ్యాక్.

* రూ. 20 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌,

* రూ.4000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుకోవ‌చ్చు.

మారుతి సెలెరియోపై రూ.59 వేల వ‌ర‌కూ డిస్కౌంట్‌

* మారుతి సెలెరియోపై రూ.35 వేలు క్యాష్‌బ్యాక్‌

* రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌, రూ.4000 కార్పొరేట్ డిస్కౌంట్.

మారుతి వాగ‌న్ఆర్‌పై రూ.49వేల డిస్కౌంట్‌

* మారుతి వాగ‌న్ఆర్ కారుపై రూ.25 వేలు క్యాష్‌బ్యాక్‌,

* రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్‌

మారుతి ఇగ్నిస్‌పై రూ.75 వేల డిస్కౌంట్‌

* మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.35 వేలు క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌

* రూ.25 వేల వ‌ర‌కూ ఎక్స్చేంజ్‌, రూ.10 వేలు కార్పొరేట్ ఎక్స్చేంజ్‌, రూ.4000 స్క్రాప్ బెనిఫిట్లు.

మారుతి స్విఫ్ట్‌పై రూ.49 వేలు డిస్కౌంట్

* మారుతి స్విఫ్ట్‌పై రూ.25 వేలు క్యాష్ బ్యాక్‌

* రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్‌.

* మారుతి డిజైర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.10 వేల ఎక్స్చేంజ్‌బోన‌స్ మాత్ర‌మే.

మారుతి బాలెనోపై రూ.45 వేలు డిస్కౌంట్‌

*మారుతి బాలెనోపై రూ.20 వేలు క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌

* రూ.10 వేలు ఎక్స్చేంజ్ (స్విఫ్ట్‌, వాగ‌న్ ఆర్‌), రూ.5000 స్క్రాపేజ్ బెనిఫిట్లు

హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 పై రూ.43 వేలు డిస్కౌంట్‌

* హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 పై రూ.30 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌

* రూ.10 వేలు క్యాష్‌బ్యాక్‌+ కార్పొరేట్ డిస్కౌంట్‌.

హ్యుండాయ్ ఔరాపై రూ.33 వేల రాయితీ

* హ్యుండాయ్ ఔరాపై రూ.10 వేల‌ క్యాష్‌బ్యాక్ (పెట్రోల్ వేరియంట్‌), రూ.20 వేలు క్యాష్ (సీఎన్జీ)

* అద‌నంగా రూ.10 వేలు ఎక్స్చేంజ్ బోన‌స్‌, రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్‌.

* హ్యుండాయ్ ఐ20 సెలెక్టెడ్ మోడ‌ల్ వేరియంట్లపై రూ.50 వేల వ‌ర‌కూ డిస్కౌంట్‌.

హోండా అమేజ్‌పై రూ.67 వేలు త‌గ్గింపు

* హోండా అమేజ్‌పై రూ.25 వేల క్యాష్ బ్యాక్‌

* రూ.15 వేల ఎక్స్చేంజ్ బోన‌స్ ప్ల‌స్ రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్ + రూ.4000 లాయాల్టీ

* సెలెక్టెడ్ ప్రొఫైల్ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌నంగా రూ.20 వేల వ‌ర‌కూ కార్పొరేట్ డిస్కౌంట్‌.

ట‌యోటా గ్లాంజాపై రూ.45 వేల రాయితీ

*ట‌యోటా గ్లాంజాపై రూ.20 వేలు విడి భాగాలు, రూ.20 వేలు ఎక్స్చేంజ్ ప్ల‌స్ కార్పొరేట్ డిస్కౌంట్‌.

కియా సొనెట్‌పై ఆఫ‌ర్లు ఇలా

* కియా సొనెట్‌పై ఐదేండ్ల వారంటీ, మూడేండ్ల ఏఎంసీ మెయింటెనెన్స్ ప్యాక్

రెనాల్ట్ క్విడ్‌పై రూ.50 వేల రాయితీ

* రెనాల్ట్ క్విడ్‌పై రూ.20 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌

* రూ.20 వేలు ఎక్స్చేంజ్‌, రూ.10 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ లేదా లాయాల్టీ

రెనాల్ట్ కైగ‌ర్‌పై రూ.65 వేల డిస్కౌంట్‌

* రెనాల్ట్ కైగ‌ర్‌పై రూ.25 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌, రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌, 20 వేలు లాయాల్టీ.

రూ. ల‌క్ష వ‌ర‌కూ రెనాల్ట్ మ్యాగ్నైట్‌పై రాయితీ

* రెనాల్ట్ మ్యాగ్నైట్‌పై అధికారికంగా రూ.97 వేల త‌గ్గింపు.

* సెలెక్టెడ్ వేరియంట్ల‌పై డీల‌ర్ల ఎండ్ ఆఫ‌ర్లు

టాటా టియాగోపై రూ.55 వేల డిస్కౌంట్‌

* టాటా టియాగోపై రూ.35 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌, రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌ + కార్పొరేట్ డిస్కౌంట్‌

టైగోర్ పెట్రోల్‌పై రూ.55 వేలు రాయితీ

* రూ.35 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌, రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌.

టాటా టైగోర్ ఐసీఎన్జీపై రూ.75 వేల త‌గ్గింపు

* టాటా టైగోర్ ఐసీఎన్జీపై రూ.50 వేలు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌,

* రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌, రూ.5000 కార్పొరేట్ డిస్కౌంట్‌.

*టాటా పంచ్ ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్ర‌మే కార్పొరేట్ డిస్కౌంట్‌.

ఇలా వేర్వేరుగా డిస్కౌంట్లు

న‌గ‌రాలు, ప్రాంతాల వారీ ఇచ్చే డిస్కౌంట్లు వేర్వేరుగా ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఉచితంగా ఇచ్చే ప‌రిక‌రాలు, ఉచిత విడి భాగాలు, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఎక్స్‌టెండెడ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఫ్రీ స‌ర్వీస్ విష‌యంలో మ‌న‌కు మెరుగ్గా ఉన్న ఆఫ‌ర్ల‌ను ఎంచుకోవాలి. ఉత్త‌మ డీల్ కావాలనుకుంటే.. ఉచిత విడి భాగాల‌కు బ‌దులు క్యాష్ డిస్కౌంట్ పొంద‌డం బెస్ట్‌. విడి భాగాల‌ను ఎక్క‌డైనా త‌క్కువ ధ‌ర‌కు పొందొచ్చు. కార్ల త‌యారీ దారులు ఇచ్చే ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందడం మంచిది. మీరు వేత‌న జీవులైతే.. కారు కొనుగోలు చేస్తున్న‌ప్పుడు కార్పొరేట్ డిస్కౌంట్ వ‌స్తుందా..? అన్న సంగ‌తి చెక్ చేసుకోవాలి. కొన్నికార్ల త‌యారీ కంపెనీలు.. ఎంపిక చేసిన కార్పొరేట్ సంస్థ‌ల ఉద్యోగుల‌కు మాత్ర‌మే కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తాయి. క‌నుక ఆ విష‌యాల‌పై డీల‌ర్ వ‌ద్ద వాక‌బు చేయ‌డం మ‌రిచిపోవ‌ద్దని నిపుణులు చెబుతున్నారు.

First Published:  10 Nov 2023 5:55 AM GMT
Next Story