Telugu Global
Business

Ola S1 Discontinue | మార్కెట్ నుంచి ఎస్‌1 ఈవీ స్కూట‌ర్ ఔట్‌.. ఓన్లీ ఎస్‌1 ఎయిర్ & ఎస్‌1 ప్రో

Ola S1 Discontinue | బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ సంస్థ‌.. ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Ola S1 Discontinue | మార్కెట్ నుంచి ఎస్‌1 ఈవీ స్కూట‌ర్ ఔట్‌.. ఓన్లీ ఎస్‌1 ఎయిర్ & ఎస్‌1 ప్రో
X

Ola S1 Discontinue | మార్కెట్ నుంచి ఎస్‌1 ఈవీ స్కూట‌ర్ ఔట్‌.. ఓన్లీ ఎస్‌1 ఎయిర్ & ఎస్‌1 ప్రో

Ola S1 Discontinue | బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ సంస్థ‌.. ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రెండేండ్ల క్రితం మార్కెట్లోకి తెచ్చిన ఎస్‌1, ఎస్‌1 ప్రో ఈవీ స్కూట‌ర్ల‌లో ఎస్‌1 (S1) స్కూట‌ర్ మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇక నుంచి ఎస్‌1 ప్రో (S1 Pro), ఎస్‌1 ఎయిర్ (S1 Air) ఈవీ స్కూట‌ర్లు మాత్ర‌మే మార్కెట్లో కొన‌సాగుతాయి.

అత్యంత చౌక ధ‌ర‌కు ల‌భించే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ ఎస్‌1 ఎయిర్ (S1 Air) కోసం ప్రీ-బుకింగ్స్ కొన‌సాగుతున్నాయి. ఎస్‌1 ఎయిర్ (S1 Air) ప‌ర్చేజింగ్ విండో ఆదివారంతో ముగియ‌నుండ‌గా ఎస్‌1 (S1) స్కూట‌ర్ ఉప‌సంహ‌రిస్తామ‌ని ఓలా ఎల‌క్ట్రిక్‌ (Ola Electric) పేర్కొన‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఎస్‌1 ఎయిర్ (S1 Air) ఈవీ స్కూట‌ర్ల ప‌ర్చేజింగ్ విండో లైవ్‌లో ఎస్‌1 క‌మ్యూనిటీ, రిజ‌ర్వ‌ర్ల‌కు మాత్ర‌మే పాల్గొనేందుకు అనుమ‌తి ఇస్తోంది. ఆదివారం వ‌ర‌కు కొనుక్కొన్న వారికి రూ.1,09,999, 31 నుంచి కొనుక్కే వారికి రూ.1,19,999ల‌కు ఎస్‌1 ఎయిర్ (S1 Air) స్కూట‌ర్ ల‌భిస్తుంది.

ఎస్‌1 ఎయిర్ (S1 Air) స్కూట‌ర్ 3- కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌తో వ‌స్తున్న‌ది. సింగిల్ చార్జింగ్‌తో 125 కి.మీ దూరం ప్రయాణించ‌వ‌చ్చు. బ్యాట‌రీ ఫుల్ చార్జింగ్ కావ‌డానికి ఐదు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఎస్‌1 ఎయిర్ స్కూట‌ర్ హ‌బ్ మోటార్‌తో వ‌స్తున్న‌ది. ఈ హ‌బ్ మోటార్ గ‌రిష్టంగా 4.5 కిలోవాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంది. కేవ‌లం 3.3 సెక‌న్ల‌లో గంట‌కు 40 కి.మీ, 5.7 సెక‌న్ల‌లో 60 కి.మీ వేగంతో ప్ర‌యాణిస్తుంది. దీని గ‌రిష్ట వేగం గంట‌కు 90 కి.మీ. ఎస్ 1 ఎయిర్ (S1 Air) ఈవీ స్కూట‌ర్ ఎకో, నార్మ‌ల్‌, స్పోర్ట్స్ మోడ్‌ల్లో ల‌భిస్తుంది.

క్రూయిజ్ కంట్రోల్‌, ట‌చ్‌స్క్రీన్ క్ల‌స్ట‌ర్, ప్రాగ్జిమిటీ అన్‌లాక్‌, కాల్ అల‌ర్ట్స్‌, పార్టీ మోడ్‌, నేవీగేష‌న్‌, వెకేష‌న్ మోడ్‌, డిజిట‌ల్ కీ, డాక్యుమెంట్ స్టోరేజీ, ప్రొఫైల్స్ అండ్ మూడ్స్‌ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా ఓలా ఎల‌క్ట్రిక్ త‌న స్క్రీన్ రిజొల్యూష‌న్‌ను 800 x 800 కి త‌గ్గించింది. ఫ్రంట్ అండ్ రేర్‌ల్లో డ్ర‌మ్ బ్రేక్స్‌, ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, రేర్‌లో డ్యుయ‌ల్ షాక్ అబ్జార్బ‌ర్స్‌, స్టీల్ వీల్స్ స్థానే అల్లాయ్ వీల్స్ రీప్లేస్ చేశారు.

First Published:  29 July 2023 9:57 AM GMT
Next Story