Telugu Global
Business

Income Tax Penalty | ఐటీఆర్‌లో ఆ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌కుంటే రూ.10 ల‌క్ష‌ల పెనాల్టీ ప‌క్కా..!

Income Tax Penalty | మీరు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టారా.. మీ ఆదాయంలో కొంత భాగం విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు కేటాయించినా.. ప్ర‌తిఏటా మీరు స‌మ‌ర్పించే ఐటీ రిట‌ర్న్స్ (ITR)లో న‌మోదు చేయ‌లేదా.. అయితే మీరు భారీగా మ‌నీ న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది.

Income Tax Penalty | ఐటీఆర్‌లో ఆ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌కుంటే రూ.10 ల‌క్ష‌ల పెనాల్టీ ప‌క్కా..!
X

Income Tax Penalty | ఐటీఆర్‌లో ఆ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌కుంటే రూ.10 ల‌క్ష‌ల పెనాల్టీ ప‌క్కా..!

Income Tax Penalty | మీరు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టారా.. మీ ఆదాయంలో కొంత భాగం విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు కేటాయించినా.. ప్ర‌తిఏటా మీరు స‌మ‌ర్పించే ఐటీ రిట‌ర్న్స్ (ITR)లో న‌మోదు చేయ‌లేదా.. అయితే మీరు భారీగా మ‌నీ న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. న‌ల్ల‌ధ‌నం చ‌ట్టం-2015 ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తులు శిక్షార్హులు. విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టిన ఓ ఇన్వెస్ట‌ర్.. తాను ప్ర‌తియేటా స‌మ‌ర్పించే ఐటీఆర్‌లోని షెడ్యూల్‌ `ఫారిన్ అసెట్స్ (ఎఫ్ఏ)`లో న‌మోదు చేయ‌లేదు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ముంబై ఇన్‌కం టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ (ఐటీఏటీ) కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. ప్ర‌తిఏటా విదేశాల్లో కొనుగోలు చేసిన షేర్లు, ఆస్తుల వారీగా రూ.10 ల‌క్ష‌ల పెనాల్టీ విధిస్తూ తీర్పు చెప్పింది. విదేశీ సంస్థ షేర్లు కొనుగోలు చేసినా, విదేశీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మ‌దుపు చేసినా, ఆస్తులు కొనుగోలు చేసినా `ఐటీఆర్‌`లోని షెడ్యూల్ ఎఫ్ఏ పూర్తిగా నింపాల్సిందే.

`బ్లాక్ మ‌నీ (గుర్తు తెలియ‌ని విదేశీ ఆదాయం, ఆస్తులు) చ‌ట్టం-2015లోని 43 సెక్ష‌న్ ప్ర‌కారం విదేశాల్లో పెటుబ‌డులు పెట్టినా, ఆస్తులు కొనుగోలు చేసినా `ఐటీఆర్‌`లో షెడ్యూల్ ఎఫ్ఏ తెల‌ప‌డంతోపాటు సంబంధిత ప‌న్నుమ‌దింపు అధికారికి స‌మాచారం ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైతే.. ఆ వ్య‌క్తిపై అధికారి రూ.10 ల‌క్ష‌ల పెనాల్టీ విధించొచ్చు` అని టాక్స్‌మాన్ వైస్ ప్రెసిడెంట్ కం చార్ట‌ర్డ్ అకౌంటెంట్ న‌వీన్ వాధ్వా పేర్కొన్నారు.

`విదేశీ ఎక్స్చేంజ్‌ల్లో వ‌ర్చువ‌ల్ డిజిట‌ల్ అసెట్స్ (వీడీఏ) కొనుగోలు చేసి, వాటిని విదేశీ వాలెట్ల‌లో నిల్వ చేసినా.. ఆ వివ‌రాల‌న్నీ షెడ్యూల్ వీడీఏ, షెడ్యూల్ `ఎఫ్ఏ`ల్లో జ‌మ చేయాలి` అని బాంబే చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (బీసీఏఎస్‌) ఉపాధ్య‌క్షుడు ఆనంద్ భాటియా చెప్పారు. భార‌త సంత‌తి ప‌థ‌కం కింద భార‌తీయ పౌరుడు అమెరికా, బ్రిట‌న్‌, కెన‌డా వంటి దేశాల్లో మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడితే షెడ్యూల్ ఎఫ్ఏ కింద న‌మోదు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. `ఉదాహ‌ర‌ణ‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో బ్లాక్‌రాక్ ఐ-షేర్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్‌) వంటి విదేశీ ఆస్తుల‌ను భార‌తీయ పౌరుడు కొనుగోలు చేసినా షెడ్యూల్ `ఎఫ్ఏ`లో న‌మోదు చేయాల్సిందే` అని భాటియా తెలిపారు.

ఆదాయం ప‌న్ను విభాగానికి విచ‌క్ష‌ణాధికారాలు ఇలా

ఐటీఆర్‌లో విదేశీ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌ని ప‌న్ను చెల్లింపుదారుడిని న‌ల్ల‌ధ‌నం చ‌ట్టం లేదా ఆదాయం ప‌న్ను చ‌ట్టం కింద ప్రాసిక్యూట్ చేసే విచ‌క్ష‌ణ అధికారం ఆదాయం ప‌న్ను విభాగానికి ఉంటుందని ఆనంద్ భాటియా చెప్పారు. ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డాల‌నే ఆలోచ‌న గానీ, ఉద్దేశం గానీ లేద‌ని, పొర‌పాటునే విదేశీ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌లేద‌ని రుజువు చేసుకున్న ప‌న్ను చెల్లింపుదారుడిపై ఆదాయం ప‌న్ను విభాగం అధికారులు పెనాల్టీ విధించ‌క‌పోవ‌చ్చు. ఇది ఆదాయం ప‌న్ను విభాగం అధికారుల ద‌ర్యాప్తుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ప‌న్ను ఎగవేత‌కు విదేశాల్లోకి న‌ల్ల‌ధ‌నాన్ని త‌ర‌లించిన‌ట్లు రుజువైతే మాత్రం పెనాల్టీతోపాటు క‌ఠిన జైలుశిక్ష కూడా విధించొచ్చు అని తెలిపారు.

ఒక వ్య‌క్తి విదేశాల్లో ఒక‌టి, అంత‌కంటే ఎక్కువ ఖాతాల్లో గానీ, సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు గానీ బ్యాలెన్స్ రూ.5 ల‌క్ష‌ల్లోపు ఉంటే న‌ల్ల‌ధ‌నం చ‌ట్టంలోని 43 సెక్ష‌న్ ప్ర‌కారం పెనాల్టీ వ‌ర్తించ‌దు. కానీ, ఐటీఆర్‌లోని షెడ్యూల్ `ఎఫ్ఏ`లో న‌మోదు చేయ‌క‌పోతే మాత్రం ఈ చ‌ట్టం వ‌ర్తిస్తుందని ఎల్ఎల్పీ లెగ‌సీ గ్రోథ్ పార్ట‌న‌ర్స్ కో-ఫౌండ‌ర్ అనంత్ జైన్ పేర్కొన్నారు.

ఐటీఆర్‌లో షెడ్యూల్ ఎఫ్ఏ (ఫారిన్ అసెట్స్‌) కింద వెల్ల‌డించాల్సిన స‌మాచారం ఇదే..

ఐటీఆర్‌లో షెడ్యూల్ ఎఫ్ఏ విభాగంలో ప‌న్ను చెల్లింపుదారుడు త‌న అన్ని విదేశీ ఆస్తుల వివ‌రాలు బ‌హిర్గ‌తం చేయాలి.

♦ భార‌త్ ఆవ‌ల ఏ ఆస్తి ఉన్నా (షేర్లు, డిబెంచ‌ర్లు, లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీలు, యాన్యుటీ కాంట్రాక్ట్‌, స్థిరాస్థులు, ఇత‌ర పెట్టుబ‌డి ఆస్తులు).

♦ ఏదైనీ విదేశీ సంస్థ‌లో ఆర్థిక లేదా ల‌బ్ధిదాయ‌క ప్ర‌యోజ‌నం (ఓవ‌ర్సీస్ ఎల్ఎల్‌పీ లేదా సంస్థ, విదేశీ ప్రైవేట్ ట్ర‌స్ట్‌).

♦ భార‌త్ ఆవ‌ల ఏ ఖాతాలోనైనా సంత‌కం అధికారం (ట్రేడింగ్‌, డిపాజిట‌రీ, బ్యాంక్ లేదా క‌స్టోడియ‌న్ అకౌంట్‌).

♦ భార‌త్ ఆవ‌ల ఏ రూపంలోనైనా ఆదాయం (డివిడెండ్‌, వ‌డ్డీ, పెట్టుబ‌డి లాభం).

First Published:  28 Sep 2023 6:52 AM GMT
Next Story