Telugu Global
Business

Maruti Diwali Offers | దీపావ‌ళి బంప‌రాఫ‌ర్లు.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వ‌ర‌కూ రూ.59 వేల వ‌ర‌కూ రాయితీలు.. ఇవీ డిటైల్స్‌..!

దీపావ‌ళి సంద‌ర్భంగా ఎక్కువ మంది కార్లు కొనుగోలు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. కార్ల త‌యారీ సంస్థలు సైతం దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించాయి.

Maruti Diwali Offers | దీపావ‌ళి బంప‌రాఫ‌ర్లు.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వ‌ర‌కూ రూ.59 వేల వ‌ర‌కూ రాయితీలు.. ఇవీ డిటైల్స్‌..!
X

Maruti Diwali Offers | దీపావ‌ళి బంప‌రాఫ‌ర్లు.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వ‌ర‌కూ రూ.59 వేల వ‌ర‌కూ రాయితీలు.. ఇవీ డిటైల్స్‌..!

Maruti Diwali Offers | మ‌రో వారంలో దీపావ‌ళి పండుగ వ‌చ్చేస్తోంది. భార‌తీయులు పండుగ‌ల సందర్భంగా త‌మ‌కు ఇష్ట‌మైన వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. ప్ర‌త్యేకించి దీపావ‌ళి పండుగ అత్యంత శుభ‌ప్ర‌దంగా భావిస్తారు. ఇంత‌కుముందు గ్యాడ్జెట్లు.. స్మార్ట్‌ఫోన్లు.. స్మార్ట్ టీవీలు.. కొనుగోలు చేసేవారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఎక్కువ మంది కార్లు కొనుగోలు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. కార్ల త‌యారీ సంస్థలు సైతం దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించాయి. వాటిల్లో అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఒక‌టిగా ఉంది. దీపావ‌ళి ఆఫ‌ర్లు ఈ నెల 12 వ‌ర‌కూ అమ‌ల్లో ఉంటాయి. ఏయే కార్ల‌పై ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందామా..!

మారుతి ఆల్టో800పై రూ.15 వేల డిస్కౌంట్‌

తొలినాటి మారుతి సుజుకి బుల్లి కార్ల‌లో ఆల్టో800 ప్ర‌జ‌లంద‌రికీ చేరువైంది. కాల క్ర‌మేణా ఎస్‌యూవీల వైపు క‌స్ట‌మ‌ర్లు మ‌ళ్లుతున్న నేప‌థ్యంలో మారుతి సుజుకి ప్ర‌స్తుతం మారుతి ఆల్టో800 మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకున్న‌ది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ నిల్వ‌లు ఉన్న మారుతి ఆల్టో800 పై మాత్ర‌మే ఆఫ‌ర్లు అందిస్తున్న‌ది. పెట్రోల్‌, సీఎన్జీ వేరియంట్లపైనా ఎక్స్చేంజ్ బోన‌స్ రూపంలో రూ.15,000 అందిస్తున్న‌ది. డిస్‌కంటిన్యూ చేయాల‌ని మారుతి సుజుకి నిర్ణ‌యించ‌క ముందు ఆల్టో800 కారు రూ.3.54 ల‌క్ష‌ల నుంచి రూ.5.13 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతోంది.


ఆల్టోకే10పై రూ.49 వేల వ‌ర‌కూ రాయితీలు

మారుతి ఆల్టో కే10 మోడ‌ల్ కారుపై గ‌రిష్టంగా రూ.49 వేల డిస్కౌంట్ అందిస్తోంది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్చేంజ్ బోన‌స్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000 ఉంటాయి. మొత్తం బెనిఫిట్లు రూ.49 వేలు. మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్‌తోపాటు సీఎన్జీ వేరియంట్ కార్ల‌పై ఈ బెనిఫిట్లు వ‌ర్తిస్తాయి. అయితే, సీఎన్జీ వేరియంట్ల‌పై క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు మాత్ర‌మే ల‌భిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ వ‌ర్తించ‌దు. మారుతి ఆల్టో కే10 ధ‌ర రూ.3.99 ల‌క్ష‌లు - రూ.5.96 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది.




ఎస్‌-ప్రెస్సోపై డిస్కౌంట్ ఇలా

మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సోపై సీఎన్జీ వ‌ర్ష‌న్ మిన‌హా అన్ని వేరియంట్ల‌పై రూ.54 వేల వ‌ర‌కూ డిస్కౌంట్‌లు అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్చేంజ్ బోన‌స్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000 ప‌లుకుతుంది. మొత్తం ఎస్‌-ప్రెస్సోపై రూ.54 వేల బెనిఫిట్ ల‌భిస్తుంది. సీఎన్జీ వేరియంట్ కారుపై క్యాష్ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్ బోన‌స్ మాత్ర‌మే వ‌ర్తిస్తాయి. మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో కారు ధ‌ర రూ.4.26ల‌క్ష‌ల నుంచి రూ.6.12 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతున్న‌ది.



రూ.29 వేల వ‌ర‌కూ `ఎకో`పై డిస్కౌంట్‌

మారుతి సుజుకి ఎకో ఆల్ ట్రిమ్స్‌పై రూ.29 వేల డిస్కౌంట్ ల‌భిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలు, ఎక్స్చేంజ్ బోన‌స్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000ల‌తో క‌లిపి మొత్తం బెనిఫిట్స్ రూ.29,000 ల‌భించింది. సీఎన్జీ వేరియంట్ల‌పై ఎక్స్చేంజ్ బోన‌స్ ల‌భిస్తుంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్ రూ.5,000 ల‌కు త‌గ్గించారు. కార్పొరేట్ డిస్కౌంట్ మిన‌హా వ‌ర్తించ‌దు. మారుతి సుజుకి ఎకో ధ‌ర రూ.5.27 - రూ. 6.53 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతున్న‌ది.


సెలెరియోపై గ‌రిష్ట డిస్కౌంట్ ఇలా

మారుతి సుజుకి సెలెరియో కారుపై గ‌రిష్టంగా రూ.59 వేల డిస్కౌంట్ అందిస్తుంది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోన‌స్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4,000 ల‌భిస్తుంది. మారుతి సుజుకి సెలెరియో మిడ్ స్పెషిపికేష‌న్ వీఎక్స్ఐ, జ‌డ్ఎక్స్ఐ, టాప్ హై ఎండ్ జ‌డ్ఎక్స్ఐ + ట్రిమ్స్ కార్ల‌పై రూ.59 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఎంట్రీ లెవెల్ ఎల్ఎక్స్ఐ ట్రిమ్‌, ఆల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్ల‌పై క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు ల‌భిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ఎంచుకుంటే క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు మాత్ర‌మే అందుకోవ‌చ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ వ‌ర్తించ‌దు. ఈ కారు ధ‌ర రూ.5.37 ల‌క్ష‌లు- 7.14 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతున్న‌ది.




First Published:  7 Nov 2023 8:36 AM GMT
Next Story