Telugu Global
Business

పాన్-ఆధార్ ఇంకా లింక్ చేయలేదా? అలాంటి వారికి ఇదే లాస్ట్ ఛాన్స్!

వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒక వేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్ నిరుపయోగంగా మారుతుంది.

పాన్-ఆధార్ ఇంకా లింక్ చేయలేదా? అలాంటి వారికి ఇదే లాస్ట్ ఛాన్స్!
X

ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) గత కొన్ని నెలలుగా కోరుతూనే ఉన్నది. ప్రతీ సారి గడువును పెంచుతూ పోతున్నా.. చాలా మంది తమ పాన్ కార్డును లింక్ చేసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికీ భారీ సంఖ్యలో పాన్ కార్డులను ఆధార్‌కు లింక్ చేయలేదు. అందుకే చివరి సారిగా అవకాశం ఇస్తున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. 2023 మార్చి 31లోపు ఆధార్-పాన్ లింకింగ్‌ను పూర్తి చేయాలని కోరింది. లేకపోతే పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుందని స్పష్టం చేసింది.

ఐటీ శాఖ తాజాగా పన్ను చెల్లింపుదారులను హెచ్చిరిస్తూ ట్వీట్ చేసింది. 'ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. మినహాయింపు పరిధిలోకి రాని పాన్ కార్డు హోల్డర్లు అందరూ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. ఇందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒక వేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్ నిరుపయోగంగా మారుతుంది. ఇంకా కొన్ని వారాలే సమయం ఉంది కాబట్టి త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయండి' అని ట్విట్టర్‌లో కోరింది.

కాగా, ఇప్పుడు కనుక పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయాలంటే రూ. 1000 పెనాల్టీని చెల్లించాల్సి ఉన్నది. గతంతోనే పలు మార్లు గడువును పొడిగించింది. తాజాగా పెనాల్టీ చెల్లించి మాత్రమే లింకింగ్ ప్రక్రియను అనుమతిస్తున్నారు. పాన్‌ కార్డులు నిరుపయోగంగా మారితే బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొత్త అకౌంట్లు తెరవడానికి కూడా వీలుండదు.



First Published:  10 Dec 2022 11:46 AM GMT
Next Story