Telugu Global
Business

Maruti Celerio Extra | మారుతి సుజుకి నుంచి న్యూ సెలెరియో ఎక్స్‌ట్రా.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Maruti Celerio Extra | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మార్కెట్లోకి సెలెరియో ఎక్స్‌ట్రా (Celerio Extra Edition) ఎడిష‌న్ తీసుకొచ్చింది.

Maruti Celerio Extra | మారుతి సుజుకి నుంచి న్యూ సెలెరియో ఎక్స్‌ట్రా.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Maruti Celerio Extra | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మార్కెట్లోకి సెలెరియో ఎక్స్‌ట్రా (Celerio Extra Edition) ఎడిష‌న్ తీసుకొచ్చింది. ఆల్టో(Alto), ఎస్‌-ప్రెస్సో (Presso) మాదిరిగానే రెగ్యుల‌ర్ సెలెరియోతో పోలిస్తే సెలెరియో ఎక్స్‌ట్రా ఎడిష‌న్ కారు ధ‌ర రూ.25000 పెరుగొచ్చున‌ని చెబుతున్నారు. రెగ్యుల‌ర్ సెలెరియో మోడ‌ల్ కారు ధ‌ర రూ.5.36 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభ‌మై టాప్ హై ఎండ్ ఫోన్ రూ.7.14 ల‌క్ష‌ల వ‌ర‌కు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది.

కొన్ని కాస్మోటెక్ మార్పుల‌తో వ‌స్తోంది సెలెరియో ఎక్స్ ట్రా ఎడిష‌న్‌. వీల్ ఆర్క్ క్లాడింగ్‌, బాడీ సైడ్ మౌల్డింగ్‌, డోర్ విజోర్ గార్నిష్ ఇన్‌స‌ర్ట్‌, మ‌ల్టీ మీడియా స్టీరియోతోపాటు స్టైలింగ్ కిట్‌, 3డీ మ్యాట్‌, బూట్ మ్యాట్‌, డోర్ సిల్ గార్డ్‌, స్టీరింగ్ క‌వ‌ర్‌, నంబ‌ర్ ప్లేట్ గార్నిష్ త‌దిత‌ర ఫీచ‌ర్లు జ‌త చేశారు.



సెలెరియో ఎక్స్ ట్రా ఎడిష‌న్ రెండో ద‌శ బీఎస్‌-6 ప్ర‌మాణాల‌కు అనుగుణంగా 1.0 లీట‌ర్ల కే10సీ డ్యుయ‌ల్‌జెట్ త్రీ సిలిండ‌ర్ పెట్రోల్ ఇంజిన్ రూపుదిద్దుకున్న‌ది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 66 హెచ్పీ విద్యుత్‌, 89 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్, 5-స్పీడ్ ఏఎంటీ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్లతో వ‌స్తోంది. ఈ కారు స్టార్ట్‌/ స్టాప్ సిస్ట‌మ్ క‌లిగి ఉంటుంది. ఈ కారు ఇంజిన్ గ‌రిష్టంగా లీట‌ర్ పెట్రోల్‌పై 26.68 కి.మీ మైలేజీ ఇస్తుంది. సీఎన్జీ వేరియంట్ కూడా ల‌భిస్తుంది.



మారుతి సుజుకి సెలెరియో ఎక్స్‌ట్రా ఎక్స్‌టీరియ‌ర్‌గా న్యూ రేడియంట్ ఫ్రంట్ గ్రిల్లె విత్ 3డీ స్క‌ల్‌ప్టెడ్ ఎక్స్‌టీరియ‌ర్ బాడీ ప్రొఫైల్‌, షార్ప్ హెడ్ లైట్ యూనిట్‌, ఫాగ్ లైట్ కేసింగ్‌, బ్లాక్ అసెంట్స్ విత్ ఫ్రంట్ బంఫ‌ర్‌, న్యూ డిజైన్‌తో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌, ఫ్లూయిడ్ లుకింగ్ టెయిల్ లైట్స్‌, క‌ర్వీ టెయిల్ గేట్ ఫీచ‌ర్ల‌తో వ‌స్తుంది. ఆరు క‌ల‌ర్స్ ఆప్ష‌న్లు - ఆర్కిటిక్ వైట్‌, సిల్కీ సిల్వ‌ర్‌, గ్లిస్టెనింగ్ గ్రే, కేఫీన్ బ్రౌన్‌, రెడ్‌, బ్లూ, సాలిడ్ ఫైర్ రెడ్‌, స్పీడీ బ్లూ రంగుల్లో ల‌భిస్తుంది.



హిల్ హోల్డ్ అసిస్ట్‌, ఇంజిన్ స్టార్ట్ స్టాఫ్, లార్జ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మ‌ద్ద‌తుతో 7-అంగుళాల స్మార్ట్ ప్లే స్లూడియో డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. క్రోమ్ అసెంట్స్‌తో ట్విన్ స్లాట్ వెంట్స్‌, షార్ప్ డాష్ లైన్స్‌తోపాటు సెంట‌ర్ ఫోక‌స్డ్ విజువ‌ల్ అప్పీల్‌, న్యూ గేర్ షిఫ్ట్ డిజైన్‌, అప్‌హోల్‌స్ట‌రీకి న్యూ డిజైన్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

డ్యుయ‌ల్ ఫ్రంట్‌ ఎయిర్ బ్యాగ్స్‌, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్ (ఏజీఎస్‌) రివ‌ర్స్ పార్కింగ్ సెన్స‌ర్లు, డే నైట్ ఐఆర్వీఎం, 60:40 స్ప్లిట్ రేర్ సీట్‌, ప‌వ‌ర్ విండోస్‌, ఎల‌క్ట్రిక్ ఓఆర్వీఎంస్‌, స్మార్ట్ ప్లే ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ విత్ 4-స్పీక‌ర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌, టిల్ట్ స్టీరింగ్‌, రేర్ డీఫాగ‌ర్‌, రేర్ వైప‌ర్‌, ఫుష్ బ‌ట‌న్ స్టార్ట్‌, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్‌, హైట్ అడ్జ‌స్ట‌బుల్ డ్రైవ‌ర్ సీట్ స‌హా 12 సేఫ్టీ ఫీచ‌ర్లు ఉంటాయి.



First Published:  27 Oct 2023 8:04 AM GMT
Next Story