Telugu Global
Business

Bajaj Pulsar NS400 | బ‌జాజ్ ఆటో `బిగ్ బైక్‌` ఆలోచ‌న‌లు.. మే3న మార్కెట్‌లోకి ప‌ల్స‌ర్ ఎన్‌400 మోటారు సైకిల్‌.. ఇదీ అస‌లు టార్గెట్‌..?!

Bajaj Pulsar NS400 | కుర్ర‌కారుకు బైక్‌లంటే స‌ర‌దా.. అటువంటి మోటారు సైకిళ్లు.. హీరో మోటార్స్ `స్ప్లెండ‌ర్స్‌` వంటి బైక్స్ మాదిరే మ‌రో దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto).. బ‌జాజ్ ప‌ల్స‌ర్ అంటే కుర్రాళ్లు ఎగిరి గంతేస్తారు.

Bajaj Pulsar NS400 | బ‌జాజ్ ఆటో `బిగ్ బైక్‌` ఆలోచ‌న‌లు.. మే3న మార్కెట్‌లోకి ప‌ల్స‌ర్ ఎన్‌400 మోటారు సైకిల్‌.. ఇదీ అస‌లు టార్గెట్‌..?!
X

Bajaj Pulsar NS400 | కుర్ర‌కారుకు బైక్‌లంటే స‌ర‌దా.. అటువంటి మోటారు సైకిళ్లు.. హీరో మోటార్స్ `స్ప్లెండ‌ర్స్‌` వంటి బైక్స్ మాదిరే మ‌రో దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto).. బ‌జాజ్ ప‌ల్స‌ర్ అంటే కుర్రాళ్లు ఎగిరి గంతేస్తారు. ద్విచ‌క్ర వాహ‌నాల్లో రారాజుగా నిలిచిన హీరో మోటో కార్ప్స్‌తోపాటు పోటీ ప‌డేందుకు బ‌జాజ్ ఆటో కూడా సిద్ధ‌మ‌వుతోంది. బిగ్ బైక్ (Big bike) స్పేస్ బ్రాండ్‌గా ప‌ల్స‌ర్ (Pulsar)ను తీర్చిదిద్దేందుకు న్యూ బ‌జాజ్ ప‌ల్స‌ర్ ఎన్ఎస్‌400 (Bajaj Pulsar NS400) మోటారు సైకిల్‌ను వ‌చ్చేనెల మూడో తేదీన మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు రంగం సిద్ధం చేసింది. త‌ద్వారా బ‌జాజ్ ప‌ల్స‌ర్ మార్కెట్‌ను రూ.15 వేల కోట్ల క్ల‌బ్‌లోకి విస్త‌రించ‌డానికి ప్ర‌ణాళిక రూపొందించింది. ప‌ల్స‌ర్ బ్రాండ్ మోటారు సైకిళ్ల విక్ర‌యంతో దేశీయ‌, విదేశీ మార్కెట్ల ద్వారా బ‌జాజ్ ఆటో దాదాపు రూ.15 వేల కోట్ల ఆదాయం సంపాదించింది. ప్ర‌స్తుతం 125సీసీ సెగ్మెంట్‌లో వేర్వేర్ `అవ‌తార్‌`ల్లో మార్కెట్‌లో ఉంది. తాజాగా బ‌జాజ్ ఆటో `ప‌ల్స‌ర్‌` బ్రాండ్ మోటారు సైకిళ్లు 250సీసీ సెగ్మెంట్‌లోకి ఎంట‌ర‌వుతున్నది.

బ‌జాజ్ ప‌ల్స‌ర్ బ్రాండ్ ప‌రిధిలో ప‌ల్స‌ర్ 125 (Pulsar 125, ప‌ల్స‌ర్ ఎన్ఎస్ 125 (Pulsar NS125), ప‌ల్స‌ర్ 150 (Pulsar 150), ప‌ల్స‌ర్ ఎన్‌150 (Pulsar N150), ప‌ల్స‌ర్ ఎన్ఎస్ 160 (Pulsar NS160), ప‌ల్స‌ర్ ఎన్‌160 (Pulsar N160), ప‌ల్స‌ర్ ఎన్ఎస్ 200 (Pulsar NS200), ప‌ల్స‌ర్ ఆర్ఎస్ 200 (Pulsar RS200), ప‌ల్స‌ర్ 220 ఎఫ్ (Pulsar 220F), ప‌ల్స‌ర్ ఎన్ 250 (Pulsar N250) ఉన్నాయి.

కేటీఎం 390 డ్యూక్ (KTM 390 Duke), ట్ర‌యంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400), ట్ర‌యంఫ్ స్క్రాంబ్ల‌ర్ 400ఎక్స్ (Triumph Scrambler 400 X) వంటి మోటారు సైకిళ్ల‌కు బ‌జాజ్ ప‌ల్స‌ర్ ఎన్ఎస్‌400 (Bajaj Pulsar NS400) గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని బ‌జాజ్ ఆటో చీఫ్ ఫైనాన్సియ‌ల్ ఆఫీస‌ర్ (సీఎఫ్ఓ) దినేష్ థాప‌ర్ చెప్పారు. ఆయా మోటారు సైకిళ్ల ధ‌ర‌లు కూడా కీల‌క పాత్ర పోషిస్తాయ‌న్నారు.

కేటీఎం 390 డ్యూక్ (KTM 390 Duke) ధ‌ర రూ.3,10,520 (ఎక్స్ షోరూమ్‌), ట్ర‌యంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400) ధ‌ర రూ.2,34,497 (ఎక్స్ షోరూమ్‌), ట్ర‌యంఫ్ స్క్రాంబ్ల‌ర్ 400 ఎక్స్ (Triumph Scrambler 400 X) ధ‌ర‌ రూ. 2,64,496 (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతున్నాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400) కంటే త‌క్కువ ధ‌ర‌కు న్యూ బ‌జాజ్ ప‌ల్స‌ర్ ఎన్ఎస్ 400 (Bajaj Pulsar NS400) బైక్ రూ.2 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌ ప‌లుకుతుంద‌ని భావిస్తున్న‌ట్లు బ‌జాజ్ ఆటో సీఎఫ్ఓ దినేష్ థాప‌ర్ తెలిపారు.

బ‌జాజ్ ప‌ల్స‌ర్ ఎన్ఎస్ 400 మోటారు సైకిల్‌లో కేటీఎం 390 డ్యూక్ (KTM 390 Duke) మోటారు సైకిల్‌లో వినియోగించిన 46పీఎస్‌/39 ఎన్ఎం 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ లేదా ట్ర‌యంఫ్ 400 ట్విన్ మోటారు సైకిళ్ల‌లో వినియోగించే 40 పీఎస్‌/37.5 ఎన్ఎం 398.15సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వాడ‌తారా? తెలియ‌రాలేదు. బ‌జాజ్ డామినార్ 400 మోటార్ సైకిల్‌లో వాడిన 40 పీఎస్‌/35 ఎన్ఎం 373సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వినియోగిస్తారా అన్న సంగ‌తి ఇంకా వెల్ల‌డి కాలేదు. `కేటీఎం, ట్ర‌యంఫ్ మోటారు సైకిళ్లు వేర్వేరు పాత్రలు పోషిస్తున్నాయి. మెరుగైన పాత్ర పోషించే బ్రాండ్ (ప‌ల్స‌ర్‌) గురించి మేం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. మార్కెట్‌లో బిగ్ బైక్ వాటా ఏమిట‌న్న‌ది టెస్టింగ్‌గా ఉంద‌ని భావిస్తున్నాం` అని దినేష్ థాప‌ర్ చెప్పారు.

First Published:  19 April 2024 7:29 AM GMT
Next Story