Telugu Global
Business

MG Hector Blackstorm | ఎంజీ మోటార్స్‌ ఆల్ బ్లాక్ ఎస్‌యూవీ ఎంజీ హెక్టార్ బ్లాక్‌స్టోర్మ్ ఎడిష‌న్ ఆవిష్క‌ర‌ణ‌..!

MG Hector Blackstorm | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors) త‌న ఎస్‌యూవీ కారు హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిష‌న్ కారు (Blackstorm) ఎడిష‌న్‌ను ఆవిష్క‌రించింది.

MG Hector Blackstorm | ఎంజీ మోటార్స్‌ ఆల్ బ్లాక్ ఎస్‌యూవీ ఎంజీ హెక్టార్ బ్లాక్‌స్టోర్మ్ ఎడిష‌న్ ఆవిష్క‌ర‌ణ‌..!
X

MG Hector Blackstorm | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors) త‌న ఎస్‌యూవీ కారు హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిష‌న్ కారు (Blackstorm) ఎడిష‌న్‌ను ఆవిష్క‌రించింది. ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిష‌న్ (MG Hector Blackstorm) కారు బ్లాక్ క‌ల‌ర్డ్ ఎక్స్‌టీరియ‌ర్‌, ఇంటీరియ‌ర్ థీమ్ ఆధారంగా రూపుదిద్దుకున్న‌ది. ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ (MG Hector Blackstorm) ఎడిష‌న్ ఎస్‌యూవీ కారు ఫైవ్‌, సిక్స్‌, సెవెన్ సీట‌ర్ కాన్ఫిగ‌రేష‌న్ల‌లో వ‌స్తోంది. డార్క్ క్రోమ్ బ్రాండ్ లోగోలు, డార్క్ క్రోమ్ ఆర్గ్యేల్ ఇన్‌స్పైర్డ్ డైమండ్ మెష్ ఫ్రంట్ గ్రిల్లె, స్కిడ్ ప్లేట్ల‌పై డార్క్ క్రోమ్ ఇన్‌స‌ర్ట్స్‌, డార్క్ క్రోమ్ టెయిల్‌గేట్ గార్నిష్‌, బాడీ సైడ్ క్లాడింగ్ మీద డార్క్ క్రోమ్ ఫినిష్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.

రెడ్ కాలిప‌ర్స్‌తోపాటు 18 అంగుళాల ఆల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌, పియాన్ బ్లాక్ రూఫ్ రెయిల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ విత్ పియానో బ్లాక్ బెజెల్‌, స్మోక్డ్ క‌నెక్టింగ్ టెయిల్ లైట్స్ వంటి ఫీచ‌ర్ల‌తో ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ (MG Hector Blackstorm) ఎడిష‌న్ కారు ఆక‌ర్ష‌ణీయంగా మారింది. ఎటువంటి అద‌న‌పు ఖ‌ర్చు లేకుండా కస్ట‌మ‌ర్ల‌కు బ్లాక్ స్ట్రోమ్ ఎంబ్లం.. డీల‌ర్ల వ‌ద్దే ఫిట్ చేస్తారు.

ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ (MG Hector Blackstorm) ఎడిష‌న్ కారు గ‌న్ మెట‌ల్ అసెంట్స్‌తోపాటు బ్లాక్ థీమ్డ్ ఇంటీరియ‌ర్ ఫీచ‌ర్లు రూపుదిద్దారు. క‌న్సోల్‌, డాష్‌బోర్డుపై గ‌న్ మెట‌ల్ గ్రే ఫినిష్‌, 14-అంగుళాల హెచ్‌డీ పోర్ట్రైట్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌, డ్యుయ‌ల్ పేన్ ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, ఆల్ బ్లాక్ లెద‌ర్ అప్‌హోల్‌స్ట‌రీ విత్ బ్లాక్ స్టోర్మ్ డిబాసింగ్ ఇన్ ది ఫ్రంట్ హార్డ్ రెస్ట్‌, లెద‌ర్ రాపింగ్ స్టీరింగ్ వీల్ విత్ గ‌న్ మెట‌ల్ ఫినిష్‌తో వ‌స్తున్న ఇంటీరియ‌ర్ డిజైన్.. ఆ కారుకు మ‌రింత ప్రీమియం లుక్ తీసుకొస్తాయి.

ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ (MG Hector Blackstorm) ఎడిష‌న్ కారు ఎల్ఈడీ ప్రొజెక్ట‌ర్ హెడ్ ల్యాంప్స్‌, ఫ్లోటింగ్ లైట్ ట‌ర్న్ ఇండికేట‌ర్స్‌, ఎల్ఈడీ క‌నెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌, ఫుల్లీ డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ ఫోన్ చార్జ‌ర్‌తోపాటు సెగ్మెంట్ ఫ‌స్ట్ డిజిట‌ల్ బ్లూటూత్ కీ, కీ షేరింగ్ కెపాబిలిటీ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి. 100 వాయిస్ క‌మాండ్ల‌తోపాటు 75కి పైగా క‌నెక్టెడ్ ఫీచ‌ర్లు కూడా జ‌త క‌లిశాయి.


ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ (MG Hector Blackstorm) రెండు ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. 1.5 లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 143 పీఎస్ విద్యుత్‌, 250 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 2.0 లీట‌ర్ల డీజిల్ ఇంజిన్ గ‌రిష్టంగా 170 పీఎస్ విద్యుత్‌, 350 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. పెట్రోల్ వేరియంట్ కారు సీవీటీ, డీజిల్ యూనిట్ 6 స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్‌కు మాన్యువ‌ల ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ లేదు.

వేరియంట్ల వారీగా ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ధ‌ర‌వ‌ర‌లు ఇలా (ఎక్స్ షోరూమ్‌):

5- సీట‌ర్ పెట్రోల్ సీవీటీ షార్ప్ ప్రో : రూ.21.25 ల‌క్ష‌లు.

5- సీట‌ర్ డీజిల్ ఎంటీ షార్ప్ ప్రో : రూ. 21.95 ల‌క్ష‌లు.

7- సీట‌ర్ పెట్రోల్ సీవీటీ షార్ప్ ప్రో : రూ. 21.98 ల‌క్ష‌లు.

7- సీట‌ర్ డీజిల్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ షార్ప్ ప్రో : రూ. 22.55 ల‌క్ష‌లు.

6- సీట‌ర్ డీజిల్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ షార్ప్ ప్రో: రూ. 22.76 ల‌క్ష‌లు.

First Published:  13 April 2024 5:54 AM GMT
Next Story