Telugu Global
Andhra Pradesh

రాజీనామాకు రెడీ.. అనిల్ కి ఆనం సవాల్

"నేను వెంకటగిరిలో రాజీనామా చేస్తా, నువ్వు నెల్లూరు సిటీలో రాజీనామా చెయ్.. ఇద్దరం నీకు నచ్చినచోట నుంచి పోటీ చేస్తాం, నీ నాయకుడు ఒప్పుకుంటాడేమో చెప్పు." అంటు అనిల్ కి సవాల్ విసిరారు ఆనం.

రాజీనామాకు రెడీ.. అనిల్ కి ఆనం సవాల్
X

నారా లోకేష్ యువగళం పాదయాత్రతో నెల్లూరు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. లోకేష్ ని అరేయ్, ఒరేయ్ అంటూ విమర్శించిన మాజీ మంత్రి అనిల్, పనిలో పనిగా ఆనం రామనారాయణ రెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతే ఘాటుగా ఆనం నుంచి బదులొచ్చింది. మొరిగేవాటన్నిటికీ తాను సమాధానం చెప్పనంటూనే దమ్ముంటే రాజీనామా చెయ్ తేల్చుకుందామని అనిల్ కి సవాల్ విసిరారు ఆనం.

వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం ఎమ్మెల్యేగా గెలిచారంటే అది జగన్ పెట్టిన భిక్ష అని ఓ ప్రెస్ మీట్లో విమర్శించారు అనిల్, ఆనంకు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేసి ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో పాల్గొనాలని హితవు పలికారు. దీనికి ఆనం నుంచి వెంటనే బదులొచ్చింది. "నేను వెంకటగిరిలో రాజీనామా చేస్తా, నువ్వు నెల్లూరు సిటీలో రాజీనామా చెయ్.. ఇద్దరం నీకు నచ్చినచోట నుంచి పోటీ చేస్తాం, నీ నాయకుడు ఒప్పుకుంటాడేమో చెప్పు." అంటు అనిల్ కి సవాల్ విసిరారు ఆనం. నీ నాయకుడే సైలెంట్ గా ఉన్న టైమ్ లో ఇలా మొరుగుతావెందుకు అంటూ బదులిచ్చారు.

ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో మళ్లీ ఏపీలో రాజకీయ విమర్శలు శృతి మించాయి. అరేయ్, ఒరేయ్ అనుకునేలా మారిపోయాయి. ఓవైపు పవన్ కల్యాణ్.. వైసీపీ నేతల్ని బట్టలూడదీసి కొడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు వైసీపీనుంచి ఎమ్మెల్యే అనిల్.. అరేయ్ ఒరేయ్, హాఫ్ నాలెడ్జ్ గా అంటూ లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెల్లూరు టీడీపీ ఒక్కసారిగా అనిల్ పై ఎదురుదాడి మొదలు పెట్టింది. అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు అనిల్ ని అరేయ్, ఒరేయ్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే ఫ్రస్టేషన్లో ఆయన ఇలా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నెల్లూరు సిటీ వైసీపీలో ఇంటిపోరు తారాస్థాయికి చేరుకున్న వేళ, అనిల్ ఒంటరిగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకోకుండా ఆనంను సీన్ లోకి లాగడంతో ఇప్పుడు ఆయన నుంచి రాజీనామా సవాల్ ఎదురైంది. నెల్లూరు సిటీలో తన కుటుంబం పేరు చెప్పుకోకపోతే అనిల్ కి ఆ కాస్త ఓట్లు కూడా పడవంటూ రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే తనని తిడుతూ తన తమ్ముడిని పొగుడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. మరి ఆనం రాజీనామా సవాల్ కి అనిల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

First Published:  25 Jun 2023 1:02 AM GMT
Next Story