Telugu Global
Andhra Pradesh

వైఎస్‌ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం..

చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపావు.. వైఎస్‌ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు.. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని ఠక్కున చెప్తారు.. కానీ, ఇప్పుడు అంతకుమించిన ఊసరవెల్లిగా కీర్తి గడిస్తున్నావు

వైఎస్‌ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం..
X

వైఎస్‌ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఫౌండర్, వైఎస్సార్‌ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ వీరాభిమానులుగా తాము అలాంటి చర్యలు సహించలేమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటూ ఆ కుటుంబాన్నే విచ్ఛిన్నం చేయాలని చూడటం దారుణమన్నారు. మొరుసుపల్లి షర్మిలగా ప్రజల ముందుకెళ్లి ఎలాంటి ఆరోపణలు చేసినా తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. కానీ ఇదేవిధంగా ముందుకెళితే మాత్రం తమలాంటి వైఎస్సార్‌ వీరాభిమానులు ఎక్కడికక్కడ షర్మిల చర్యలను నిలదీస్తారని ఆయన స్పష్టం చేశారు. గురువారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా..

చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపావు.. వైఎస్‌ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు.. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని ఠక్కున చెప్తారు.. కానీ, ఇప్పుడు అంతకుమించిన ఊసరవెల్లిగా కీర్తి గడిస్తున్నావు.. అంటూ కొండా రాఘవరెడ్డి షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలది ఆదర్శనీయమైన కుటుంబమని, వారు ఎంతో మందికి మేలు చేశారని, కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మానసిక పరిస్థితేంటో అర్థం కావడం లేదని ఆయన చెప్పారు.

ఆడ బిడ్డను కాదు.. ఈడ బిడ్డనే అంది.. పార్టీని మూసేసింది..

తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టిన షర్మిల ఆడ బిడ్డను కాదు.. ఈడ బిడ్డనే అని చెప్పిందని, మా వైఎస్సార్‌ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డామని రాఘవరెడ్డి తెలిపారు. కానీ చివరికి ఎన్నికలకు ముందు పార్టీని మూసేసిందని మండిపడ్డారు. షర్మిల వల్ల తెలంగాణలో ఉన్న వైఎస్సార్‌ అభిమానులు, ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆమె ఏపీకి వచ్చి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే తన ధ్యేయమంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

దేశ చరిత్రలో ఏం సీఎం కొడుకూ జగన్‌లా పోరాడి సీఎం కాలేదు

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా పోరాడి సీఎం కాలేదని కొండా రాఘవరెడ్డి గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన పరిపాలనలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, ప్రధానంగా మైనార్టీలకు దేశంలో ఎక్కడాలేని విధంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనదేనని చెప్పారు. ఈ ఘనత వైఎస్సార్‌దేనని.. కాంగ్రెస్‌ పార్టీది కాదని స్పష్టం చేశారు. ఇక మహానేత మరణానంతరం కాంగ్రెస్‌ చర్యలతో ఆ పార్టీలో ఇమడలేక వైసీపీని స్థాపించిన జగన్‌.. ఎన్నో కష్టాలను అనుభవించారని తెలిపారు. సీఎం కాగానే ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పాలన అందిస్తున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అదృష్టమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

First Published:  12 April 2024 5:19 AM GMT
Next Story