Telugu Global
Andhra Pradesh

న్యాయాన్ని ఓడించడానికి కోట్లు వెదజల్లుతున్నారు..

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఉద్దేశిస్తూ.. మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయతీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు..? అంటూ ఆ ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

న్యాయాన్ని ఓడించడానికి కోట్లు వెదజల్లుతున్నారు..
X

న్యాయాన్ని ఓడించడానికి నారా ఫ్యామిలీ కోట్ల రూపాయలు వెదజల్లుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్ట‌ర్‌ వేదికగా ఆయన శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పలు కుంభకోణాల కేసుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరఫున దేశంలో పేరుమోసిన లాయర్లు పలు కోర్టుల్లో తమ వాదనలు వినిపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఓ పక్క కోట్లు వెదజల్లుతూ పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా..? అని ప్రశ్నించారు.


బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఉద్దేశిస్తూ.. మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయతీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు..? అంటూ ఆ ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా..? అని ఆయన నిలదీశారు. చంద్రబాబు ప్లీడర్లు రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబును బయటికి తీసుకొచ్చేందుకు ట్రయల్‌ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కి పైగా పిటిషన్లు వేశారని ఆయన తెలిపారు. వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయని చెప్పారు. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వారికే తెలియనంత గందరగోళం నెలకొందని వివరించారు. పెండింగ్‌ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు చంద్ర‌బాబు తలనొప్పిలా మారాడని చెప్పారు. న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

First Published:  21 Oct 2023 11:46 AM GMT
Next Story