Telugu Global
Andhra Pradesh

అమ్మా పురందేశ్వ‌రీ.. మీది కుటుంబ రాజ‌కీయ‌మా.. కుటిల‌ రాజ‌కీయ‌మా..?

‘అమ్మా పురందేశ్వరి గారూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు.

అమ్మా పురందేశ్వ‌రీ.. మీది కుటుంబ రాజ‌కీయ‌మా.. కుటిల‌ రాజ‌కీయ‌మా..?
X

అమ్మా పురందేశ్వ‌రీ.. మీది కుటుంబ రాజ‌కీయ‌మా.. కుటిల‌ రాజ‌కీయ‌మా..?

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె వల్ల ఒక్క ఓటైనా బీజేపీకి అదనంగా వస్తుందా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఇంతకీ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఆయన సంధించిన ప్రశ్నలు ఏమిటంటే.. ‘అమ్మా పురందేశ్వరి గారూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు. అంటే... మీది కుటుంబ రాజకీయమా?. కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే రాజకీయమా?’ అంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.


పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ, ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. మొదట టీడీపీ, తర్వాత ఎన్టీఆర్‌ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, మళ్లీ బీజేపీ.. ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిదని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే.. ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది.. అంటూ ఆయన విమర్శించారు. మరి దీనిపై పురందేశ్వరి ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

First Published:  4 Nov 2023 8:00 AM GMT
Next Story