Telugu Global
Andhra Pradesh

‘రామోజీ భార్యపై, కోడలిపై అలాగే రాస్తే ఊరుకుంటారా?’

మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే మేం నిరసన కూడా తెలుపకూడదా? మేం తప్పులు చేస్తే ఎత్తి చూపండి. కానీ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తామంటే అది కరెక్ట్‌ కాదు. నేను తప్పులు చేశానని నిరూపిస్తే నా ఆస్తులన్నీ రాసిస్తా.

‘రామోజీ భార్యపై, కోడలిపై అలాగే రాస్తే ఊరుకుంటారా?’
X

వైసీపీ ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి వంద కోట్ల రూపాయ‌ల‌ ఆస్తులు ఉన్నట్లు తన ఈనాడులో రామోజీరావు ఓ కట్టుకథ రాశారు. దాని గురించి అడగడానికి వెళ్తే ఈనాడు కార్యాలయంపై దాడి చేశారంటూ మరో కట్టుకథ అల్లారు. తనకు వేయి కోట్ల ఆస్తి ఉన్నట్లు రామోజీరావు రాశాడని, ఆ పేపర్లు చూపిస్తే ఆ ఆస్తులన్నీ రామోజీకి రాసిస్తానని, ఈనాడులో ఇష్టం వచ్చినట్లు రాసినందుకే తమ వాళ్లు వెళ్లారని, దాడి చేయాలని వెళ్లలేదని, కేవలం నిరసన తెలియజేయడానికే వెళ్లారని, కనీసం ఆఫీసులోకి కూడా వెళ్లలేదని కాటసాని రాంభూపాల్‌ రెడ్డి వివరించారు.

రామోజీరావుకు విలువలంటూ ఉంటే రాంభూపాల్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించాలి. ఆ సవాల్‌ను స్వీకరించడానికి రామోజీరావు సిద్ధంగా ఉంటారా..? చంద్రబాబు కరపత్రం ఈనాడు కాబట్టి అందుకు సిద్ధంగా ఉండరనేది అందరికీ తెలుసు. కానీ, బట్ట కాల్చి మీద వేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరనే విషయం రామోజీరావుకు తెలియదా? కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఇచ్చిన వివరణను రామోజీరావు కచ్చితంగా ఈనాడులో ప్రచురించాల్సి ఉంటుంది. లేదంటే రాసిన రాతలు నిజమని నిరూపించుకోవాలి. అటువంటి విలువలు రామోజీకి ఉన్నాయా?

‘‘మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే మేం నిరసన కూడా తెలుపకూడదా? మేం తప్పులు చేస్తే ఎత్తి చూపండి. కానీ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తామంటే అది కరెక్ట్‌ కాదు. నేను తప్పులు చేశానని నిరూపిస్తే నా ఆస్తులన్నీ రాసిస్తా. తప్పుడు పనులు రామోజీ చేస్తూ మాపై ఆరోపణలు చేయడం ఏమిటి? ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాపై తప్పుడు వార్తలు రాయటం పత్రికా స్వేచ్ఛ కాదు’’ అని రాంభూపాల్‌ రెడ్డి మండిపడ్డారు.

తనకు పది శాతం వాటాలు ఎవరు ఇచ్చారో ఈనాడు రామోజీరావు నిరూపించాలని, రాసిన తప్పుడు వార్తలపై వివరణ అడగడానికి వెళ్తే ఆఫీసుకు తాళం వేసుకుని పారిపోయారని, వారు రాసింది నిజమే అయితే పారిపోవాల్సిన అవసరం ఏంటని, దమ్ముంటే తనను ఎదుర్కోవాలని, అంతేగానీ కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేయొద్దని ఆయన అన్నారు. రామోజీ భార్యపై,న కోడలిపై ఇలాగే తప్పుడు రాతలు రాస్తే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

First Published:  21 Feb 2024 2:32 PM GMT
Next Story