Telugu Global
Andhra Pradesh

జగన్ పాత్రలో అదరగొట్టిన జీవా

జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారు. టీజర్ లో ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో వైఎస్ భారతిగా కేతకి నారాయణన్, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీగా సుజానే బెర్నాడ్ నటించారు.

జగన్ పాత్రలో అదరగొట్టిన జీవా
X

యాత్ర మూవీ ఫేమ్ మహీ వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాత్ర -2 మూవీ టీజర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం యాత్ర. ఈ మూవీకి సీక్వెల్ గా యాత్ర -2 తెరకెక్కింది. ఇందులో వైఎస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు.

యాత్ర మొదటి భాగంలో వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టడం, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును వివరించారు. యాత్ర -2లో వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ రాజకీయంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, జైలుకు వెళ్లడం వంటి సంఘటనలను వివరించారు. ఆ తర్వాత జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఆయా ఘటనలను టీజర్ ద్వారా దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు.

జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారు. టీజర్ లో ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో వైఎస్ భారతిగా కేతకి నారాయణన్, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీగా సుజానే బెర్నాడ్ నటించారు. ఆయా పాత్రల్లో వీరు చక్కగా కుదిరారు. గత ఎన్నికలకు ముందు యాత్ర మూవీ విడుదల కాగా, ఈ ఎన్నికల ముందు యాత్ర -2 విడుదల కానుంది. ఫిబ్రవరి 8న ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.

First Published:  5 Jan 2024 10:14 AM GMT
Next Story