Telugu Global
Andhra Pradesh

లోకేష్ ఢిల్లీ వదిలి ఎందుకు రావట్లేదు.. కారణం ఏంటి..?

లోకేష్ ఢిల్లీ పర్యటనపై పార్టీ శ్రేణుల్లో ఉన్న ఆసక్తి, రోజులు గడిచే కొద్దీ పూర్తిగా తగ్గిపోతోంది. ఢిల్లీ వెళ్లిన లోకేష్ కేంద్రంలోని పెద్దల్ని కలుస్తారని అనుకున్నా ఒక్కరు కూడా అవకాశమివ్వలేదు.

లోకేష్ ఢిల్లీ వదిలి ఎందుకు రావట్లేదు.. కారణం ఏంటి..?
X

కేంద్రంలోని పెద్దలెవరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు..

పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల హడావిడి ఏమాత్రం పనిచేయలేదు

పార్లమెంట్ ముందు, రాజ్ ఘాట్ వద్ద నిరసనలకు ఫలితం లేదు

ఏపీ అసెంబ్లీనుంచి టీడీపీ స్వచ్ఛందంగా పలాయనవాదం చిత్తగించింది.

బాబుకి బెయిల్ రాకపోగా, కస్టడీ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది, క్వాష్ పిటిషన్ కూడా కుదర్లేదు.

ఇంత జరుగుతున్నా నారా లోకేష్ ఇంకా ఎందుకు ఢిల్లీలో ఉన్నారు..? పార్లమెంట్ పూర్తయినా కూడా ఆయన ఢిల్లీని వదిలి ఎందుకు ఏపీకి రావట్లేదు..? లోకేష్ ఢిల్లీ పర్యటనపై పార్టీ శ్రేణుల్లో ఉన్న ఆసక్తి, రోజులు గడిచే కొద్దీ పూర్తిగా తగ్గిపోతోంది. ఢిల్లీ వెళ్లిన లోకేష్ కేంద్రంలోని పెద్దల్ని కలుస్తారని అనుకున్నా ఒక్కరు కూడా అవకాశమివ్వలేదు. పోనీ లోకేష్ ని కలసినవారు కూడా పెద్దస్థాయి నాయకులు కాదు.

అరెస్ట్ భయంతోనే..!

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన ఢిల్లీ వదిలి రావట్లేదని వైసీపీ అనుకూల మీడియా కథనాలిస్తోంది. ఒకవేళ సీఐడీ అరెస్ట్ చేయాలంటే ఢిల్లీలో ఉన్నా వదిలిపెట్టదు, అందుకని అరెస్ట్ భయం ఉందనుకోలేం. అయితే లోకేష్ కి కూడా ఢిల్లీలో పనిలేదు, ఉన్నా అద్భుతాలు జరుగుతాయన్న ఆశ కూడా లేదు. ఈ దశలో ఇంకా ఆయన హస్తినలో మకాం వేయడం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇటు ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ తొడగొట్టి మీసం మెలేసి, విజిల్స్ వేసి పరువు తీసేశారు. మరి లోకేష్ ఇంకా ఢిల్లీలోనే ఉండటం దేనికి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

First Published:  23 Sep 2023 1:19 AM GMT
Next Story