Telugu Global
Andhra Pradesh

వైజాగ్ డ్రగ్స్ కేసులో పొలిటికల్ డ్రామా

టీడీపీ హయాంలో ‘సంధ్య ఆక్వా’ అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ హయాంలో ఆ కంపెనీ సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆక్వా కంపెనీ యాజమాన్యం పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వైజాగ్ డ్రగ్స్ కేసులో పొలిటికల్ డ్రామా
X

విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ డ్రగ్ రాకెట్ వెనక ఎవరున్నారనే విషయంలో సీబీఐ అధికారులు విచారణ మొదలు పెట్టారు. డ్రగ్స్ కంటైనర్ డెలివరీ అడ్రస్ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కావడంతో ఆ సంస్థపై కూడా అధికారులు దాడులు చేశారు. ఆ కంపెనీకి కూనం వీరభద్రరావు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారని, సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ ప్రతినిధులను సీబీఐ అధికారులు పిలిపించి మాట్లాడారు. వివరాలు సేకరించారు.

ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందంటూ ఆల్రడీ సాక్షిలో కథనాలొచ్చాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి సంధ్య ఆక్వా కంపెనీతో సంబంధాలున్నాయని ఆ కథనం సారాంశం. పురందేశ్వరి బంధువులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి అని, ఆయనకు టీడీపీ నేతలతోను, బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక టీడీపీ హయాంలో ‘సంధ్య ఆక్వా’ అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ హయాంలో ఆ కంపెనీ సీజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలోనూ వీరి పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ వెర్షన్..

ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడిన తర్వాత నారా లోకేష్ ట్విట్టర్లో రెచ్చిపోయారు. ఎన్నికల టైమ్ లో వైసీపీ డ్రగ్స్ మాఫియా బయటపడిందని అన్నారాయన. అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో చివరి నిమిషంలో వైసీపీ చీకటి మాఫియాలు జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయని కౌంటర్ ఇచ్చారు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో జే గ్యాంగ్ ఈ డ్రగ్స్ దిగుమతి చేసిందన్నారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన కంపెనీకి డ్రగ్స్ పార్శిల్ రాగా ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. విశాఖను రాజధాని చేయడం కాదని, డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారని మండిపడ్డారు లోకేష్.


ఇక టీడీపీ కొత్త కథ అల్లింది. డ్రగ్స్ పట్టుబడిన వెంటనే వైసీపీ నేతలు ఒత్తుళ్లు ప్రారంభించారని, కంటైనర్ తెరవకుండా, తెరిచినా విచారణ ఆలస్యమయ్యేలా ప్రయత్నించారని, చివరకు విఫలమయ్యారని ఈనాడు కథనం సారాంశం. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వంపై కూడా బురదజల్లింది ఈనాడు. ఇప్పటికే యువతను గంజాయికి బానిసలుగా చేశారని, ఇప్పుడు డ్రగ్స్ కి బానిసలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలిచ్చారు. సదరు సంధ్య ఆక్వా కంపెనీ.. కొవిడ్‌ సమయంలో సీఎం సహాయనిధికి రూ.50లక్షలు ప్రకటించిందనే పాయింట్ ని కూడా ఈనాడు హైలైట్ చేసింది.

First Published:  22 March 2024 2:28 AM GMT
Next Story