Telugu Global
Andhra Pradesh

పర్చూరు ఓట్లు.. పురందేశ్వరి పరువు తీసిన విజయసాయి ట్వీట్లు

పురందేశ్వరి కేరాఫ్ అడ్రస్ పర్చూరు. ఆమెకు ఓటు హక్కు కూడా అక్కడే ఉంది. అయితే 2019లో జరిగిన పర్చూరు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 6. ఆ 6 ఓట్లలో పురందేశ్వరి ఓటు ఉందో లేదో అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

పర్చూరు ఓట్లు.. పురందేశ్వరి పరువు తీసిన విజయసాయి ట్వీట్లు
X

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆమెను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు వేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ ట్వీట్ల పరంపరలో ఇప్పుడు మరో ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ పూర్తిగా పురందేశ్వరి పరువు తీసేలా ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా అసలు పురందేశ్వరిని ఎందుకు ఎంపిక చేశామా అని బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడేలా ఉంది ఆ ట్వీట్. ఆఖరికి తన సొంత ఊరిలో, తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ పరిధిలో కూడా బీజేపీకి నాలుగు ఓట్లు వేయించుకునే స్థితిలో పురందీశ్వరి లేరని ఆ ట్వీట్ సారాంశం.


పురందేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీకి అధ్యక్షురాలు. 2014 నుంచి ఆమె బీజేపీలో ఉన్నారు. కానీ ఆమె వల్ల బీజేపీ ఏమాత్రం లాభపడలేదని, కనీసం నాలుగు ఓట్లు కూడా బీజేపీకి ఆమె వేయించలేకపోయారనేది విజయసాయిరెడ్డి వాదన. పురందేశ్వరి కేరాఫ్ అడ్రస్ పర్చూరు. ఆమెకు ఓటు హక్కు కూడా అక్కడే ఉంది. అయితే 2019లో జరిగిన పర్చూరు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 6. ఆ 6 ఓట్లలో పురందేశ్వరి ఓటు ఉందో లేదో అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. కనీసం తన సొంత ఊరిలో తన ఓటు ఉన్న 145వ పోలింగ్ బూత్ పరిధిలో బీజేపీకి 6ఓట్లు పడటం ఏంటని లాజిక్ తీశారు. అంటే సొంత పార్టీకి కూడా పురందేశ్వరి ఓటు వేసే, వేయించే స్థితిలో లేరని, అలాంటి నాయకురాలికి అధ్యక్ష పదవి ఎందుకని పరోక్షంగా ప్రశ్నించారు.

"మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్దాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్ళీ!" అంటూ కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.

First Published:  14 Nov 2023 7:41 AM GMT
Next Story