Telugu Global
Andhra Pradesh

4వ తేదీ టెన్ష‌నే చంద్ర‌బాబుకు నిద్ర లేకుండా చేస్తుందా?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు పిటీషన్లు వేశారు. ఒకటేమో ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి విచారణ జరపాలని. ఇక రెండో కేసేమో కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుండి తప్పించి సీబీఐతో విచారణ చేయించాలని.

4వ తేదీ టెన్ష‌నే చంద్ర‌బాబుకు నిద్ర లేకుండా చేస్తుందా?
X

కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందనే సామెత చంద్రబాబునాయుడికి సరిగ్గా సరిపోతుంది. విషయం ఏమిటంటే అప్పుడెప్పుడో ముగిసిపోయిందని అనుకున్న ఓటుకు నోటు కేసు కూడా ఈనెల 4వ తేదీనే విచారణకు రాబోతోంది. ఇప్పటికే స్కిల్ స్కామ్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో 23 రోజులుగా రిమాండులో ఉన్నారు. తనపైన నమోదైన కేసు అక్రమమని కాబట్టి క్వాష్ చేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ కేసు విచారణ 4వ తేదీన జరగబోతోంది. క్వాష్ పిటీషన్‌పై వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఇదే సమయంలో అప్పుడెప్పటిదో ఓటుకు నోటు కేసు విచారణ కూడా అదే రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు పిటీషన్లు వేశారు. ఒకటేమో ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి విచారణ జరపాలని. ఇక రెండో కేసేమో కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుండి తప్పించి సీబీఐతో విచారణ చేయించాలని.

పై రెండు పిటీషన్లపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది చాలా కీలకమైంది. ఎందుకంటే రెండు కేసుల్లో ఏ ఒక్కటి ఎమ్మెల్యేకి అనుకూలంగా వ‌చ్చినా చంద్రబాబుకు కష్టాలు తప్పవు. 2014లో వెలుగుచూసిన ఓటుకు నోటు కేసులో తనకు వ్యతిరేకంగా కోర్టుల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగకుండా చంద్రబాబు మ్యానేజ్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కేసు విచారణ ఏమవుతుందో ఎవరికీ తెలియ‌దు.

అలాంటిది ఇప్పుడు సడెన్‌గా సుప్రీంకోర్టు విచారణకు రావటం చంద్రబాబుకు ఇబ్బందనే చెప్పాలి. పిటీషన్‌లో ఎమ్మెల్యే అడిగినట్లు చంద్రబాబును ముద్దాయిగా చేర్చినా లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించినా చంద్రబాబుకు సమస్యలు తప్పవు. ఎందుకంటే ఇప్పుడున్న కేసులు, విచారణకు అదనంగా ఓటుకు నోటు కేసు కూడా తోడవుతుంది. అప్పుడు ఈ కేసులో కూడా ఎప్పుడైనా దర్యాప్తు అధికారులు విచారణకు పిలవచ్చు లేదా అదుపులోకి తీసుకోవచ్చు. అప్పట్లో తనకున్న పలుకుబడితో తన జోలికి ఎవరు రాకుండా చంద్రబాబు మ్యానేజ్ చేసుకున్నారు. అయితే కాలం ఎల్ల‌ప్పుడు ఒకేలాగుండదు కదా. ఇప్పుడు ఆ కాలమే చంద్రబాబును ఎదురుతంతోంది. మరి 4వ తేదీన ఏమవుతుందో చూడాల్సిందే.


First Published:  2 Oct 2023 5:02 AM GMT
Next Story