Telugu Global
Andhra Pradesh

లైసెన్స్ గ‌న్‌ కోసం అనుమ‌తి కోరిన సినీ న‌టుడు న‌రేశ్‌

న‌రేశ్ గ‌త కొంత‌కాలంగా సినీ న‌టి ప‌విత్రా లోకేశ్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి గొడ‌వ చేసి.. మీడియాకు కూడా ఎక్కడం తెలిసిందే.

లైసెన్స్ గ‌న్‌ కోసం అనుమ‌తి కోరిన సినీ న‌టుడు న‌రేశ్‌
X

సినీ న‌టుడు న‌రేశ్ త‌న‌కు లైసెన్స్ రివాల్వ‌ర్‌ అనుమ‌తి ఇవ్వాల‌ని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. గురువారం ఆయన పుట్టపర్తిలో ఎస్పీని కలిశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం రివాల్వ‌ర్ అనుమ‌తి కోరుతున్నాన‌ని తెలిపారు. గ‌తంలో మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉండటంతో 2008లో లైసెన్స్ రివాల్వర్ పొందానని వివ‌రించారు. దానికి మళ్లీ అనుమతి ఇవ్వాలని గతంలోనూ కోరాన‌ని, అందుకు అనుమ‌తి ఇవ్వలేదని చెప్పారు.

ప్ర‌స్తుతం తాను హిందూపురంలో నివాసం ఉంటున్నాన‌ని న‌రేశ్ ఎస్పీకి తెలిపారు. లైసెన్సు రివాల్వర్ తన వద్ద ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఈ సంద‌ర్భంగా ఆయన ఎస్పీని కోరారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని నరేశ్ తెలిపారు.

న‌రేశ్ గ‌త కొంత‌కాలంగా సినీ న‌టి ప‌విత్రా లోకేశ్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తి గొడ‌వ చేసి.. మీడియాకు కూడా ఎక్కడం తెలిసిందే. ఈ త‌రుణంలోనే న‌రేశ్ ప‌విత్రా లోకేశ్‌తో క‌లిసి `మ‌ళ్లీ పెళ్లి` అనే సినిమా కూడా తీశారు.

తాజాగా న‌రేశ్ రివాల్వ‌ర్ కోసం అనుమ‌తి కోరిన సంద‌ర్భంలో ఎస్పీకి ఏయే కార‌ణాలు వివ‌రించార‌నే విష‌యం తెలియ‌లేదు. త‌న‌కు ఎవ‌రి నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని భావిస్తున్నార‌నే విష‌యం ఈ సంద‌ర్భంగా ఎస్పీకి తెలియ‌జేయ‌డం త‌ప్ప‌నిస‌రి. మ‌రి ఆయ‌న త‌న‌కు ఎవ‌రి నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని చెప్పార‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

First Published:  7 July 2023 5:34 AM GMT
Next Story