Telugu Global
Andhra Pradesh

పార్టీ ప‌ద‌వులిచ్చి జో కొడతారా.. చంద్ర‌బాబుపై సీనియ‌ర్ల ఆగ్రహం

మాజీ మంత్రి , కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌కు ఈసారి టికెటివ్వ‌లేదు. దీనిపై ఆయ‌న మండిప‌డిపోతున్నారు. ఆయ‌న్ను కూల్ చేసేందుకు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు చంద్ర‌బాబు.

పార్టీ ప‌ద‌వులిచ్చి జో కొడతారా.. చంద్ర‌బాబుపై సీనియ‌ర్ల ఆగ్రహం
X

చంద్ర‌బాబు రాజకీయ‌మే వేరు. వేలికి వేస్తే కాలికి.. కాలికి వేస్తే వేలికి వేయ‌డంలో నంబ‌ర్ వ‌న్‌. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశించి పార్టీ కోసం ప‌నిచేసిన చాలా మంది నేత‌ల‌కు హ్యాండిచ్చేశారు. ఇప్పుడు వారికి పార్టీ ప‌ద‌వులంటూ హ‌డావుడి చేస్తున్నారు. అధికారంలో లేని పార్టీ, మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుందో లేదో తెలియని పార్టీలో ఎంత పెద్ద ప‌దవి ఇస్తే మాత్రం ఎవ‌రికి కావాల‌ని టీడీపీ నేత‌లు విసుక్కుంటున్నారు.

జ‌వ‌హ‌ర్‌కు, గండి బాబ్జీకి ప‌ద‌వులు

మాజీ మంత్రి , కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌కు ఈసారి టికెటివ్వ‌లేదు. దీనిపై ఆయ‌న మండిప‌డిపోతున్నారు. ఆయ‌న్ను కూల్ చేసేందుకు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు చంద్ర‌బాబు. విశాఖ సౌత్ అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జీకి చేయిచ్చేశారు. ఆ స్థానాన్ని జ‌న‌సేన‌కు కేటాయించ‌డంపై బాబ్జీ ఆగ్ర‌హంగా ఉన్నారు. ఆయ‌న్ను ఇప్పుడు విశాఖ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు. రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.వి.రాముడు లాంటి నేత‌ల‌కూ ఇదే కోటాలో పార్టీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

పార్టీని వీడే ప్ర‌య‌త్నాల్లో నేత‌లు

కొవ్వూరులో టికెట్ ద‌క్క‌ని జ‌వ‌హ‌ర్ పార్టీ మీద‌, చంద్ర‌బాబు మీద ఆగ్ర‌హంగా ఉన్నారు. అవ‌స‌ర‌మైతే పార్టీ మారి లేదంటే వైసీపీలో చేరి అయినా పోటీ చేయ‌మ‌ని ఆయ‌న వ‌ర్గీయులు జ‌వ‌హ‌ర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సౌత్‌లో టికెట్ ద‌క్క‌ని బాబ్జీ కూడా ఏ క్ష‌ణ‌మైనా పార్టీకి రిజైన్ చేయొచ్చ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వాళ్ల‌కు ప‌ద‌వులిచ్చి జో కొట్టాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నారు. నాలిక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాని పార్టీ ప‌ద‌వులను తామేం చేసుకోవాల‌ని సీనియ‌ర్లు మండిపడుతున్నారు.

First Published:  26 March 2024 2:22 PM GMT
Next Story