Telugu Global
Andhra Pradesh

మీ తాత టీడీపీ సర్పంచ్ - రాయుడి కోసం టీడీపీ గాలం

అంబటి రాయుడికి గాలం వేసేందుకు ''మీ తాత గతంలో టీడీపీ సర్పంచ్'' అంటూ టీడీపీ గుర్తు చేస్తోంది. రాయుడు కోసం టీడీపీలోని కొందరు కాపు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కాపు సామాజికవర్గం బేస్‌గా ఉన్న జనసేన కూడా అంబటి కోసం ప్రయత్నాలు చేస్తోంది.

మీ తాత టీడీపీ సర్పంచ్ - రాయుడి కోసం టీడీపీ గాలం
X

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలని అంబటి రాయుడు భావిస్తుండడంతో పలు పార్టీలు ఆహ్వానం పలుకుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జగన్‌ పాలనపై అంబటి రాయుడు ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించారు. దాంతో ఆయన వైసీపీ పట్ల ఇష్టంగా ఉన్నారన్న ప్రచారం నడిచింది. ఇప్పుడు జనసేన, టీడీపీ, కాంగ్రెస్‌ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు పార్టీలోకి వస్తే మంచి జరుగుతుందని టీడీపీ ఆశిస్తోంది. ఇందుకోసం ఎంపీ టికెట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది ఆ పార్టీ. అంబటి రాయుడిది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు సొంతూరు. మరి గుంటూరు ఎంపీ టికెట్‌ను టీడీపీ ఆఫర్ చేస్తుందా అన్నది చూడాలి. అదే జరిగితే గల్లా జయదేవ్‌కు చెక్‌ పడినట్టే.

అంబటి రాయుడికి గాలం వేసేందుకు ''మీ తాత గతంలో టీడీపీ సర్పంచ్'' అంటూ టీడీపీ గుర్తు చేస్తోంది. అంబటి రాయుడు కోసం టీడీపీలోని కొందరు కాపు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కాపు సామాజికవర్గం బేస్‌గా ఉన్న జనసేన కూడా అంబటి రాయుడు కోసం ప్రయత్నాలు చేస్తోంది. క్రికెటర్ అజారుద్దీన్‌ కాంగ్రెస్‌ తరపున ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లోకి వస్తే మాల్కాజ్‌గిరి ఎంపీ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇస్తామంటోంది కాంగ్రెస్‌. అయితే ఇప్పటి వరకు వైసీపీకి సానుకూలంగా ట్వీట్లు చేయడం తప్ప మిగిలిన ఆఫర్లపై అంబటి రాయుడు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.

First Published:  7 Jun 2023 8:39 AM GMT
Next Story