Telugu Global
Andhra Pradesh

సునీత ఓవర్ యాక్షన్ పెరిగిపోతోందా?

వైయ‌స్ వివేకా హత్యకేసు దర్యాప్తుకు సంబంధించి సీబీఐ డైరీ వివరాలు తనకు కావాలని సునీత‌ పిటీషన్ వేశారు. దానిని చూసి జడ్జీలు ఆశ్చర్యపోయారు. సీబీఐ దర్యాప్తు వివరాల డైరీ మీకిస్తారని ఎలాగ అనుకున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సునీత ఓవర్ యాక్షన్ పెరిగిపోతోందా?
X

రోజురోజుకు వైఎస్ సునీత ఓవర్ యాక్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. తన తండ్రి వైఎస్ వివేకానండరెడ్డి హంతకులకు శిక్షలు పడాల్సిందే అన్న సునీత పోరాటం అభినందనీయమే. అయితే ఆ పోరాటం ముసుగులో ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతోంది. మొదటి నుండి సునీత వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ఎలాగంటే తన తండ్రిని హత్య చేసినవాళ్ళల్లో ముఖ్యుడైన దస్తగిరి బెయిల్ మీద తన కళ్ళముందే తిరుగుతున్నా బెయిల్ రద్దు చేయాలని సునీత అనుకోవటంలేదు.

ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలాగైనా జైల్లో పెట్టించాల్సిందే అన్న పట్టుదలతో పోరాడుతున్నారు. ఇందుకు అవకాశాలు తక్కువని తెలిసినా పోరాటం చేస్తునే ఉన్నారు. దీన్నే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జీలు సూటిగా సునీతను నిలదీశారు. అవినాష్‌ను జైలుకు పంపించటమే మీ లక్ష్యమా అని డైరెక్టుగా సునీతనే అడిగారంటేనే ఆమె ఓవర్ యాక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థ‌మవుతోంది. దస్తగిరి విషయంలో తప్ప మిగిలిన అందరి పిటీషన్లలోనూ సునీత ఇంప్లీడవుతునే ఉన్నారు.

ఇవన్నీ పక్కనపెట్టేస్తే తాజాగా హత్యకేసు దర్యాప్తుకు సంబంధించి సీబీఐ డైరీ వివరాలు తనకు కావాలని పిటీషన్ వేశారు. సునీత పిటీషన్‌ను చూసి జడ్జీలు ఆశ్చర్యపోయారు. సీబీఐ దర్యాప్తు వివరాల డైరీ మీకిస్తారని ఎలాగ అనుకున్నారంటూ జడ్జీలు ఆమెను అడిగారు. సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన వివరాలను తాను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పటంతో జడ్జీలు విస్తుపోయారు. సీబీఐ డైరీ వివరాలు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.

సునీత వైఖరి ఎలాగుందంటే నిందితుల్లో బెయిల్ ఎవరికి రావాలి? ఎవరు జైల్లో ఉండాలి? అనేది కూడా తానే నిర్ణయించాలన్నట్లుగా ఉంది. ఎవరు బెయిల్ కోసం పిటీషన్ వేసినా వెంటనే వాళ్ళ కేసుల్లో ఇంప్లీడైపోతున్నారు. తన వాదన వినకుండా వాళ్ళ బెయిల్ పిటీషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు లేదని వాదిస్తున్నారు. ఈ విషయంలో కూడా జడ్జీలు తీవ్ర అసహనం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అయినా తన పద్ధ‌తి మార్చుకోకుండా తాజాగా ఏకంగా సీబీఐ డైరీనే అడిగి జడ్జీల ఆగ్రహానికి గురయ్యారు.

First Published:  19 July 2023 5:51 AM GMT
Next Story