Telugu Global
Andhra Pradesh

జగన్ పై దాడి కేసు.. దుర్గారావు ఎపిసోడ్ లేనట్టేనా..?

ఈ కేసులో ఇంకా ముద్దాయిలు ఉన్నారా..? కేవలం ఏ-1 సతీష్ ని మాత్రమే నిందితుడిగా పేర్కొంటున్నారా అనేది తేలాల్సి ఉంది.

జగన్ పై దాడి కేసు.. దుర్గారావు ఎపిసోడ్ లేనట్టేనా..?
X

సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి కేసులో ఇప్పటికే పోలీసులు సతీష్ అనే యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. రాయితో దాడి చేసింది సతీష్ కాగా, ఆ దాడి వెనక ఎవరెవరున్నారనే విషయాలపై కూపీ లాగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో దుర్గారావు అనే పేరు బలంగా వినపడింది. అయితే దుర్గారావు ఇప్పుడు బయటకొచ్చారు. తప్పు తనపై వేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారంటున్నారు దుర్గారావు. ఈ కేసులో ఏ-1 ని పోలీసులు అరెస్ట్ చూపించగా, ఏ-2 విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇటు దుర్గారావు కూడా బయటకు వచ్చేశారు కాబట్టి, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిందా లేదా అనేది తేలాల్సి ఉంది.

బోండా ఉమా హడావిడి..

జగన్ పై జరిగిన దాడి వెనక టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఓ దశలో బోండా ఉమా.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఇంటిపైకి వచ్చారని, హడలెత్తిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కానీ అక్కడ కూడా వ్యవహారం ముందుకు సాగలేదు ఏ-1 అరెస్ట్ చూపించిన మరుసటి రోజే ఏ-2 ని కూడా కోర్టులో పోలీసులు ప్రవేశ పెడతారనే వార్తలు వినిపించినా అది సాధ్యం కాలేదు. మరి ఈ కేసులో ఇంకా ముద్దాయిలు ఉన్నారా..? కేవలం ఏ-1 సతీష్ ని మాత్రమే నిందితుడిగా పేర్కొంటున్నారా అనేది తేలాల్సి ఉంది.

సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో ఇప్పటికే టీడీపీ సెల్ఫ్ గోల్స్ వేసుకుంది. ఈ దాడి వైసీపీ వాళ్లే చేయించుకున్నారని దాడి ఘటనను తక్కువ చేసి చూపాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. రాయి వేసిన వారికి టీడీపీకి సంబంధం ఉందని తెలుస్తోంది కానీ, వైసీపీకి సంబంధాలున్నాయని ఎక్కడా రుజువులు లేవు. అయితే ఇక్కడ కూడా వడ్డెర సామాజిక వర్గం వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటోంది టీడీపీ. ఈ ప్రయత్నాలన్నీ ఇప్పటికే విఫలం అయ్యాయి. ఎన్నికల నాటికి ఈ దాడి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంటే మాత్రం అది వైసీపీకే మరింత లాభం చేకూరుస్తుందని అంటున్నారు. జగన్ పై జరిగిన దాడి వ్యవహారంలో అనవసరంగా నోరు జారి తిప్పలు కొని తెచ్చుకుంటోంది టీడీపీ.

First Published:  21 April 2024 2:20 PM GMT
Next Story