Telugu Global
Andhra Pradesh

టీచర్‌ పోస్టులు.. రామోజీకి నిజాలు వద్దు, ముంచినా చంద్రబాబే ముద్దు

చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తర్వాత చివరి ఏడాదిలో ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాన్ని కూడా సరిగా నిర్వహించలేక చేతులెత్తేశారు.

టీచర్‌ పోస్టులు.. రామోజీకి నిజాలు వద్దు, ముంచినా చంద్రబాబే ముద్దు
X

తన ప్రియ‌ శిష్యుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకం రామోజీరావుకు కనిపించదు. చంద్రబాబు చేసిన తప్పులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ వస్తుంటే అబద్ధాలతో బురద చల్లడానికి మాత్రం రామోజీ ప‌త్రిక ఈనాడు ముందు వ‌రుస‌లో ఉంటుంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తర్వాత చివరి ఏడాదిలో ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాన్ని కూడా సరిగా నిర్వహించలేక చేతులెత్తేశారు.

ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టుకు ఎక్కారు. ఇందులో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను చంద్రబాబు కేవలం 300 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. 2018 డీఎస్సీలో చంద్రబాబు చేతిలో దగాపడ్డ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టి 6,954 మంది అభ్యర్థులకు టీచర్‌ పోస్టులు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డీఎస్సీ నోటిఫికేషన్స్‌ పోస్టుల భర్తీ జరగనే లేదు. అలాంటి పోస్టులన్నింటనీ మురగబెట్టి ఇప్పుడు 11 వేల పోస్టులకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీన్నే రామోజీరావు మెగా డీఎస్సీ అంటున్నాడు.

జగన్‌ ప్రభుత్వంలో టీచర్‌ పోస్టుల భర్తీ ఇలా జరిగింది..

1998 డీఎస్సీ - 4,059

2008 డీఎస్సీ - 2,193

2018 డీఎస్సీ - 6,954

2019 స్పెషల్ డీఎస్సీ - 602

కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు - 1,200

2024 డీఎస్సీ - 6,100

మొత్తం పోస్టులు - 21,108

తెలంగాణలో ఇవన్నీ ఉన్నాయా... రామోజీరావు..?

ఇంగ్లీష్‌ మీడియం, టోఫెల్‌, సీబీఎస్‌ఈ సిలబస్‌, జగనన్న గోరుముద్ద, పేద విద్యార్థులకు ట్యాబ్స్‌, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి సాయం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఐఎఫ్‌పీలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ బోధనతో పాటు మారుమూల ప్రభుత్వ బడుల్లోకి వస్తున్న ప్రపంచం మెచ్చిన ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) సిలబస్‌

విద్యారంగంలో వైఎస్‌ జగన్‌ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విద్యారంగంపైనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశారు. ఏపీలో మనబడి నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యలో సంభవించిన సమూల మార్పులు కళ్లకు కడుతున్నాయి.

First Published:  2 March 2024 7:22 AM GMT
Next Story