Telugu Global
Andhra Pradesh

ఇక్కడ కూడా కొంచెపు బుద్ధేనా.. రామోజీ రావు..?

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు ఫిరాయించిన ఎనిమిది మంది శాసనసభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.

ఇక్కడ కూడా కొంచెపు బుద్ధేనా.. రామోజీ రావు..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా రామోజీరావు ఈనాడు ప‌త్రిక బరితెగించి రాస్తోంది. జగన్‌ ప్రభుత్వ పథకాలపై నిత్యం అబద్ధాల చిట్టాను విప్పుతుండటం ఒకటైతే, పద ప్రయోగంలో జగన్‌కూ, చంద్రబాబుకూ మధ్య తేడాను ప్రదర్శించడం రెండోది. జగన్‌ పట్ల అది ఎంత వివక్షాపూరితంగా రామోజీరావు వ్యవహరిస్తున్నారో చెప్పాలంటే, తాజాగా ఈనాడులో ప్రచురితమైన ఒక వార్తను పరిశీలిస్తే ఇట్లే అర్థమైపోతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు ఫిరాయించిన ఎనిమిది మంది శాసనసభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వారిలో నలుగురు టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించగా, మరో నలుగురు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. ఈ వార్తను రాస్తూ.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినవారిని వైసీపీ రెబెల్‌ ఎమ్యెల్యేలుగా పేర్కొంటూ, టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించినవారిని టీడీపీ నుంచి గెలిచి వైసీపీ పంచన చేరినవారిగా పేర్కొన్నారు.

అందులోని అర్థం బోధపడే ఉంటుంది. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైసీపీ నుంచి టీడీపీలోకి మారినవారు రెబెల్‌ ఎమ్యెల్యేలయ్యారు, టీడీపీ నుంచి వైసీపీకి మారినవారు పంచన చేరినవారయ్యారు. ఒక సాధారణమైన వార్తలోనే ఇంత కొంచెపు బుద్ధి చూపిస్తే, మిగతా విషయాల్లో ఈనాడు ఎంతగా బరి తెగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

First Published:  27 Feb 2024 2:16 PM GMT
Next Story