Telugu Global
Andhra Pradesh

అవినాష్‌పై రామోజీ ఏడుపు

అవినాష్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏమీలేవన్న విషయం కూడా ఎల్లో బ్యాచ్‌కు బాగా తెలుసు. అయినా సరే జగన్ మీద అక్కసుతో అవినాష్‌పైన బురదచల్లేస్తున్నాయి. ఇప్పుడు కడప ఎంపీగా టికెట్ రావటంతో ఏడుపు మరింత ఎక్కువైంది.

అవినాష్‌పై రామోజీ ఏడుపు
X

ఎల్లో మీడియా యజమాని రామోజీరావు ఏడుపు ఏమిటో అర్థంకావటంలేదు. ’హవ్వ...అవినాష్ కు మళ్ళీ టికెట్టా’ ? అనే హెడ్డిండ్‌తో పెద్ద స్టోరీ అచ్చేశారు. ఇందులో ఏముందంటే వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ8 నిందితుడు అవినాష్‌కు మళ్ళీ కడప ఎంపీగా టికెట్ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న బిడియం లేదట. ప్రతిపక్షాల నుండి విమర్శలున్నా పట్టించుకోరట. సొంతచెల్లి, బాబాయ్ కూతురు ప్రశ్నిస్తున్నా వినిపించుకోరట. చివరకు ఓట్లేసే జనాలు ఏమనుకుంటారో అని కూడా ఆలోచింటంలేదట. వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాయ్ కొడుకు అవినాష్‌ను జగన్ వెనకేసుకొస్తున్నట్లు రామోజీ తెగబాధపడిపోయారు.

జగన్+అవినాష్‌కు వ్యతిరేకంగా ఇంతపెద్ద స్టోరీ రాసిన రామోజీ తాను చట్టం, న్యాయం, ధర్మానికి కట్టుబడున్నట్లు పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఎల్లో మీడియా కథనంలోనే వివేకా హత్యకేసులో అవినాష్‌ను అనుమానితుడని చెప్పింది. అనుమానితుడంటే హంతకుడో లేకపోతే హత్య కుట్రలో పాత్రుందని నిరూపణైన వ్యక్తో కాదు. అనుమానితుడంటే కేవలం అనుమానితుడు మాత్రమే. అనుమానితులందరు తప్పులు, ఘోరాలు చేసినవాళ్ళు కాదు. వైసీపీని కడప ఎంపీ ఎన్నికల్లో ఓడించటం తమవల్ల కాదని ప్రతిపక్షాలకు అర్థ‌మైపోయింది. అందుకని వివేకా హత్యను అడ్వాంటేజ్‌గా తీసుకుని ఎల్లో మీడియా సాయంతో జగన్, అవినాష్ మీద ప్రతిరోజు బురదచల్లేస్తున్నారు.

హత్యలో అవినాష్ పాత్రుందని ఇప్పటివరకు సీబీఐ ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా కూతురు సునీతతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా మాత్రం పదేపదే అవినాష్ మీద బురదచల్లేస్తున్నారు. గూగుల్ టేకౌట్ సాంకేతిక ఆధారంగా హంతకులతో అవినాష్‌కు సంబంధముందని మొదట్లో వాదించిన సీబీఐ తర్వాత తమ వాదన తప్పని కోర్టులో సాంకేతిక సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంది. అవినాష్ అరెస్టు ఖాయమని అనుకున్న ఎల్లోబ్యాచ్ కోరిక నెరవేరలేదు.

అవినాష్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏమీలేవన్న విషయం కూడా ఎల్లో బ్యాచ్‌కు బాగా తెలుసు. అయినా సరే జగన్ మీద అక్కసుతో అవినాష్‌పైన బురదచల్లేస్తున్నాయి. ఇప్పుడు కడప ఎంపీగా టికెట్ రావటంతో ఏడుపు మరింత ఎక్కువైంది. ఇదే సమయంలో టీడీపీ కూటమిలో గొడవలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ గొడవలు ఇలాగే కంటిన్యూ అయితే అవినాష్ గెలుపు ఖాయమని అర్థ‌మైపోయింది. ఆరోపణలున్న వారికి టికెట్ ఇవ్వకూడదన్న రామోజీ వాదనే కరెక్టయితే చంద్రబాబుతో పాటు చాలామంది పోటీ చేయకూడదు. మరిదే సలహా రామోజీ టీడీపీ అధినేతకు కూడా ఇస్తారా?

First Published:  17 March 2024 9:04 AM GMT
Next Story