Telugu Global
Andhra Pradesh

అత్తా కోడళ్లిద్దరూ పవన్ ని ఐస్ చేశారు

పవన్ తో భువనేశ్వరి, బ్రాహ్మణి మీటింగ్ అంటే.. భర్తల్ని తిట్టినందుకు కడిగేస్తారేమో అనుకున్నానని.. కానీ వారిద్దరూ ఆ ప్రస్తావనే లేకుండా కాపు ఓట్లకోసం పవన్ ని కలసి డ్రామాలాడుతున్నారని అన్నారు. వారిద్దరూ భర్తల్ని మించిపోయారని సెటైర్లు పేల్చారు పోసాని.

అత్తా కోడళ్లిద్దరూ పవన్ ని ఐస్ చేశారు
X

కాపు ఓట్లకోసం అత్తా కోడళ్లు.. భువనేశ్వరి, బ్రాహ్మణి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి. వారిద్దరూ పవన్ కల్యాణ్ ని పిలిచి టీ తాగుతావా, కాఫీ తాగుతావా అంటున్నారని.. ఐస్ చేయగానే పవన్ కరిగిపోయారని చెప్పారు. పవన్ కల్యాణ్ అమాయకుడని, వారిద్దరూ అలా ఐస్ చేయగానే 'నేను సపోర్ట్ చేస్తా'నంటూ ముందుకొచ్చారని చెప్పారు పోసాని. గతంలో చంద్రబాబు, లోకేష్ ని పవన్ తిట్టాడని.. పవన్ తో భువనేశ్వరి, బ్రాహ్మణి మీటింగ్ అంటే.. భర్తల్ని తిట్టినందుకు కడిగేస్తారేమో అనుకున్నానని.. కానీ వారిద్దరూ ఆ ప్రస్తావనే లేకుండా కాపు ఓట్లకోసం పవన్ ని కలసి డ్రామాలాడుతున్నారని అన్నారు. వారిద్దరూ భర్తల్ని మించిపోయారని సెటైర్లు పేల్చారు పోసాని.

జూనియర్ గాంధీలు..

భారత దేశానికి ఒక్కరే గాంధీ ఉండేవారని.. కానీ ఏపీకి చంద్రబాబు, లోకేష్ ఇద్దరు జూనియర్ గాంధీలు అని ఎద్దేవా చేశారు పోసాని. మా ఆయన నిజాయితీ పరుడు.. మాకేం తక్కువ డబ్బు కాజేయడానికి అని భువనేశ్వరి అంటున్నారని.. అసలు కొడుకు లోకేష్ నాశనం కావడానికి భువనేశ్వరే కారణం అని చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లడానికి కారణం జగనా? జడ్జా? అని ప్రశ్నించారు. చట్టం ఆయన్ను జైలుకి పంపించిందని.. నిజంగానే తాము కక్ష తీర్చుకోవాలనుకుంటే నాలుగేళ్ల క్రితమే జైలుకి పంపించేవాళ్లమని అన్నారు పోసాని.

ఈ రాష్ట్రాన్ని తమ భర్తలే ఏలాలి అని భువనేశ్వరి, బ్రాహ్మణి అనుకుంటున్నారని చెప్పారు పోసాని. సామాజిక న్యాయం, అవినీతి లేని సమాజం అంటూ పవన్ రాజకీయాల్లోకి వచ్చారని.. కానీ టీడీపీతో కలసి తప్పు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని ఘోరాలు చేశారో తెలిసికూడా.. మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేస్తానని పవన్ చెప్పడం అమాయకత్వం అన్నారు. చంద్రబాబు మెంటల్లీ సిక్ అని చెప్పి బయటకు తీసుకొస్తావా పవన్.. అని ప్రశ్నించారు పోసాని. కాపు నాయకుడిని, ఓ లెజెండ్ ని చంపిన దుర్మార్గుడ్ని జైలు నుంచి బయటకు తీసుకొస్తావా అన్నారు. దుర్మార్గుడైన చంద్రబాబుకు సపోర్ట్ చేయొద్దని తాను పవన్ ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నారు. పవన్ ఒక లైన్ తో జనాల్లోకి వెళ్తే చరిత్రలో నిలిచిపోతాడని హితవు పలికారు పోసాని.

First Published:  2 Oct 2023 9:47 AM GMT
Next Story