Telugu Global
Andhra Pradesh

అనకాపల్లిలో సీఎం రమేష్ దౌర్జన్యాలు.. నోటీసులిచ్చిన పోలీసులు

తాజాగా నర్సీపట్నంలోని కృష్ణా ప్యాలెస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన సీఎం రమేష్.. పువ్వు గుర్తుతో ఉన్న చీరలు పంచి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రావడంతో.. వారిని ఆయన దబాయించడం మొదలు పెట్టారు.

అనకాపల్లిలో సీఎం రమేష్ దౌర్జన్యాలు.. నోటీసులిచ్చిన పోలీసులు
X

అనకాపల్లి లోక్ సభ అభ్యర్థిగా బీజేపీ తరపున బరిలో ఉన్న సీఎం రమేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అసలు అనకాపల్లికి ఆయన లోకల్ కాదు. పొత్తుల ఎత్తుల్లో ఇక్కడ టికెట్ ఖాయం కావడంతో తన సొంత ఊరు కడప జిల్లా పోట్లదుర్తి నుంచి ఓ బ్యాచ్ ని రంగంలోకి దించారు సీఎం రమేష్. అనకాపల్లిలో అలజడులు సృష్టిస్తున్నారు. ఇటీవల చోడవరంలో జీఎస్టీ అధికారులపై దాడికి సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా పోలీసులు 41-ఏ నోటీసులిచ్చారు.

అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్‌ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో డీఆర్ఐ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. సంస్థ యజమాని సీఎం రమేష్ కి ఫోన్ చేసి సహాయం కోరారు. వెంటనే ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తాను పెద్ద సంగతి అంటూ డీఆర్ఐ అధికారుల ముందు బిల్డప్ ఇచ్చారు. తన బ్యాచ్ ని తీసుకొచ్చి రౌడీయిజం చేశారు. దీంతో డీఆర్ఐ అధికారులు అక్కడినుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ వారిచ్చిన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు సీఎం రమేష్ పై కేసు నమోదు చేశారు. గత రాత్రి పోటీసులు ఆయనకు 41-ఏ నోటీసులు ఇచ్చారు. ఈనెల తొమ్మిదో తేదీన విచారణను హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

చీరల పంపిణీలో రచ్చ రచ్చ..

తాజాగా నర్సీపట్నంలోని కృష్ణా ప్యాలెస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన సీఎం రమేష్.. పువ్వు గుర్తుతో ఉన్న చీరలు పంచి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రావడంతో.. దబాయించడం మొదలు పెట్టారు సీఎం రమేష్. ఇవి ఎన్నికల తాయిలాలు కావని.. కార్యకర్తలకు, స్థానికులకు తాను ఇస్తున్న కానుకలని చెప్పారు. ఓటర్లుకు తమ పార్టీ సింబల్‌ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు.

చంద్రబాబు కోటాలో బీజేపీ టికెట్ దక్కించుకున్న సీఎం రమేష్ తన అక్రమార్జనతో ఇక్కడ ఓట్లు కొనాలని స్కెచ్ వేశారు. కడప జిల్లా నుంచి వచ్చి అనకాపల్లిలో కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారు. కుప్పంలో చంద్రబాబుకోసం దొంగఓట్లు వేయించిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నా.. స్థానిక టీడీపీ కేడర్ అంతా ఆయనతోనే ఉంటోంది. అనకాపల్లిలో ఆల్రడీ సీఎం రమేష్ దందా మొదలైంది. బీజేపీ పేరు చెప్పుకుని, చంద్రబాబు అండ చూసుకుని చెలరేగిపోతున్నారాయన. ఈ ప్రాంతంతో ఆయనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓటుకు నోటుని ఎరవేసి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు సీఎం రమేష్.

First Published:  7 April 2024 3:17 AM GMT
Next Story