Telugu Global
Andhra Pradesh

పైకి రౌడీలా కనిపించినా తెలివైనోడు.. కొడాలికి పేర్ని నాని సర్టిఫికెట్

వరుసగా 4సార్లు గుడివాడ నుంచి ఎన్నికైన కొడాలి నాని, ఐదోసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు పేర్ని నాని. దానికోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని అన్నారు.

పైకి రౌడీలా కనిపించినా తెలివైనోడు.. కొడాలికి పేర్ని నాని సర్టిఫికెట్
X

గుబురు గడ్డం, మెడలో రుద్రాక్ష మాల, నోట్లో కిళ్లీ.. ఇలా పైకి రౌడీలా కనిపించినా కొడాలి నాని తెలివైన రాజకీయ నాయకుడని కితాబిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయనలాంటి తెలివైన నాయకుడు సమకాలీన రాజకీయాల్లో ఎవరూ లేరని చెప్పారు. గుడివాడ ఆర్టీసీ డిపో ప్రారంభోత్సవానికి వచ్చిన పేర్ని నాని, కొడాలిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన గెటప్ రౌడీలా ఉంటుందని, కానీ మనిషి పక్కా రాజకీయ నాయకుడని, పాదరసం కంటే వేగంగా ఆయన బుర్ర పనిచేస్తుందని కితాబిచ్చారు.

అవన్నీ వట్టి డ్రామాలు..

చదువు గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా కొడాలి నాని.. ఏడో తరగతి, పదో తరగతి అంటూ కబుర్లు చెబుతారని, అవన్నీ వట్టి డ్రామాలేనన్నారు పేర్ని నాని. పైకి అమాయకంగా కనిపించినా, కొడాలి అత్యంత తెలివైనవారని చెప్పారు. అందుకే నాలుగుసార్లు గుడివాడలో గెలిచారని, ఐదోసారి కచ్చితంగా గెలుస్తారని, గుడివాడ పేరు చెబితే కొడాలి నాని అనే పేరు వినిపించేలా మారిపోయారని ప్రశంసల జల్లు కురిపించారు పేర్ని నాని.

వరుసగా 4సార్లు గుడివాడ నుంచి ఎన్నికైన కొడాలి నాని, ఐదోసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు పేర్ని నాని. దానికోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని అన్నారు. కొంతమంది కొడాలి నానిపై పోటీ చేయడానికి ఉబలాటపడుతున్నారని, వారిలో వారే పోటీ పడుతున్నారని, అలాంటి వారందర్నీ ఓడించే సత్తా కొడాలికి ఉందన్నారు పేర్ని నాని.

జగన్ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరిగిందన్నారు పేర్ని నాని. ఏపీలో ఆర్టీసీ ఎప్పటికీ ప్రైవేటుపరం కాదని చెప్పారు. రూ.10 కోట్లతో గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి టెండర్ పిలవబోతున్నామని, మే 19న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.

First Published:  30 April 2023 10:01 AM GMT
Next Story