Telugu Global
Andhra Pradesh

నేను సీఎంలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని కాకపోయినా..! పవన్ పంచ్ లు

బొత్స చాలా కన్వీనియంట్ ఆన్సర్ చెప్పారని, అసలు డీఎస్సీ ఎప్పుడు వేస్తారని సూటిగా ప్రశ్నించారు పవన్. తాను సీఎం లాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని కానని, అయినా విద్యార్థుల అవసరాలకోసం ప్రశ్నిస్తూ ఉంటానన్నారు.

నేను సీఎంలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని కాకపోయినా..! పవన్ పంచ్ లు
X

ఏపీలో పొలిటికల్ సబ్జెక్ట్ కాస్త మారింది. వాలంటీర్ల వ్యవహారం కాస్తా బైజూస్ సంస్థపైకి మళ్లింది. పవన్ కల్యాణ్.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రభుత్వం తరపున మంత్రి బొత్స కౌంటర్లివ్వడంతో సీన్ కాస్త హాట్ హాట్ గా మారింది. తాజాగా మళ్లీ పవన్ కల్యాణ్ యాక్టివ్ అయ్యారు. బైజూస్ వ్యవహారంలో అంత గోప్యత ఎందుకంటున్నారు. ఏరికోరి నష్టాల్లో ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ ఇచ్చేముందు అధికారికంగా ఎలాంటి కసరత్తు జరిగిందని ప్రశ్నిస్తున్నారు పవన్.

ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న ట్యాబ్ లలో ఉచితంగా కంటెంట్ అందిస్తామని బైజూస్ కంపెనీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. ఒక్క ఏడాదే ఉచిత కంటెంట్ ఇస్తామని బైజూస్ హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం హడావిడిగా ట్యాబ్ లు పంపిణీ చేసిందని, వచ్చే ఏడాది బైజూస్ కంటెంట్ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆ కంటెంట్ ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, లేక ఆ భారాన్ని విద్యార్థులపై నెడుతుందా అని లాజిక్ తీశారు. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే ఏడాది ప్రభుత్వం 750కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని గుర్తు చేశారు పవన్.


వీటికి సమాధానం చెప్పలేదేం..?

పవన్ కల్యాణ్ వేసిన మొదటి ట్వీట్ కి బొత్స ఆన్సర్ ఇచ్చారు. అయితే ఆ సమాధానంలో అసలు విషయం లేదని, కేవలం కాంట్రాక్ట్ ల విధి విధానాలనే మంత్రి చెప్పారని, బైజూస్ విషయంలో కుదిరిన ఒప్పందం వివరాలు లేవని అంటున్నారు పవన్. దీనికోసం మరోసారి బొత్సను టార్గెట్ చేస్తూ ట్వీట్ వేశారు. బొత్స చాలా కన్వీనియంట్ ఆన్సర్ చెప్పారని, అసలు డీఎస్సీ ఎప్పుడు వేస్తారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో 50,677 ఉపాధ్యాయ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారన్నారు. తన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలన్నారు పవన్. తాను సీఎం లాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని కానని, అయినా విద్యార్థుల అవసరాలకోసం తాను ప్రశ్నిస్తూ ఉంటానన్నారు.

First Published:  23 July 2023 11:21 AM GMT
Next Story