Telugu Global
Andhra Pradesh

ఏ పార్టీలో ఉన్నారో తెలియని రాయుడు జ‌న‌సేన స్టార్ క్యాంపెయిన‌ర‌ట‌!

జ‌న‌సేనానికి క‌లిసిన రాయుడు ఆ పార్టీలో చేరిన‌ట్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. ఇంత‌లోనే మార్చి 27న తెల్ల‌వారుజామున 3.17 గంట‌ల‌కు సిద్ధం అనే ఒక్క ప‌దంతో అంబ‌టి ఎక్స్ లో ట్వీట్ చేయ‌డంతో మ‌ళ్లీ వైసీపీ వైపు వెళుతున్నార‌నే చ‌ర్చ న‌డిచింది.

ఏ పార్టీలో ఉన్నారో తెలియని రాయుడు జ‌న‌సేన స్టార్ క్యాంపెయిన‌ర‌ట‌!
X

ఎట్ట‌కేల‌కు త‌న‌కిచ్చిన 21 సీట్ల‌కు అభ్య‌ర్థుల్ని ఫైన‌ల్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తిస్థాయి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ప‌లువురిని ఎంపిక చేశారు. మొద‌టి నుంచి జ‌న‌సేనకు మ‌ద్దతుగా ప్ర‌చారం చేస్తున్న హైప‌ర్ ఆది లాంటి ప‌లువురికి ఇందులో చోటిచ్చారు. అయితే ఏ పార్టీలో ఉన్నారో తెలియ‌ని మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడిని జ‌న‌సేన స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

వైసీపీలో చేరి.. రాజీనామా చేసి..

గ‌తేడాది డిసెంబ‌ర్ చివ‌రిలో అంబ‌టి రాయుడు వైసీపీలో చేరాడు. అత‌ను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తార‌ని కూడా ప్ర‌చారం న‌డిచింది. వారం కూడా తిరక్క‌ముందే వైసీపీకి రాయుడు రాజీనామా చేశాడు. దుబాయ్ క్రికెట్ లీగ్‌లో ఆడ‌నున్నందున రాజ‌కీయాల‌కు టైమ్ కేటాయించలేక‌పోతున్నాన‌ని, అందుకే రాజీనామా చేశాన‌ని చెప్పుకొచ్చాడు. ఆ త‌ర్వాత నాలుగు రోజుల కూడా తిరక్కుండానే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశాడు.

జ‌న‌సేన‌లో చేర‌లేదుగా..

జ‌న‌సేనానికి క‌లిసిన రాయుడు ఆ పార్టీలో చేరిన‌ట్లు ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. ఇంత‌లోనే మార్చి 27న తెల్ల‌వారుజామున 3.17 గంట‌ల‌కు సిద్ధం అనే ఒక్క ప‌దంతో అంబ‌టి ఎక్స్ లో ట్వీట్ చేయ‌డంతో మ‌ళ్లీ వైసీపీ వైపు వెళుతున్నార‌నే చ‌ర్చ న‌డిచింది. ఇలా ఏ పార్టీలో ఉన్నాడో అత‌నికే స్ప‌ష్ట‌త లేని అంబ‌టి రాయుణ్ని జ‌న‌సేన స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించడ‌మేంట‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లే గొణుగుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాగే నిల‌క‌డ‌లేనిత‌న‌మే అంబ‌టి రాయుడికి ఉండ‌టం మ‌రి జ‌న‌సేనానిని ఆక‌ర్షించిందేమో మ‌రి!!!

మిగిలిన స్టార్ క్యాంపెయిన‌ర్లు వీరే

ప‌వ‌న్ సోద‌రుడు, జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు, జ‌న‌సేన‌లో చేరిన కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ న‌టులు హైప‌ర్ ఆది, గెట‌ప్ శ్రీ‌ను, వైసీపీ వేటేసి బ‌య‌ట‌కు పంపిన థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీని కూడా స్టార్ క్యాంపెయిన‌ర్లుగా నియ‌మించిన‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించింది.

First Published:  10 April 2024 2:27 PM GMT
Next Story