Telugu Global
Andhra Pradesh

ప్రభుత్వ స్కూళ్ళల్లో నో వేకెన్సీయా?

ద్యా వ్యవస్థ‌ను బలోపేతం చేసే విష‌యంపై జగన్ బాగా దృష్టిపెట్టారు. దాని ఫలితంగా ప్రభుత్వ మున్సిపల్, పంచాయితీ స్కూళ్ళల్లో అడ్మిషన్లకు చాలా చోట్ల నో వేకెన్సీ బోర్డులు పెట్టేస్తున్నారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించాలని పట్టుబ‌డుతున్నారు.

ప్రభుత్వ స్కూళ్ళల్లో నో వేకెన్సీయా?
X

ప్రభుత్వ స్కూళ్ళల్లో నో వేకెన్సీయా?

ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు సాకారమవుతున్నాయి. తాజా అడ్మిషన్ల వ్యవహారం చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. విద్యా వ్యవస్థ‌ను బలోపేతం చేసే విష‌యంపై జగన్ బాగా దృష్టిపెట్టారు. దాని ఫలితంగా ప్రభుత్వ మున్సిపల్, పంచాయితీ స్కూళ్ళల్లో అడ్మిషన్లకు చాలా చోట్ల నో వేకెన్సీ బోర్డులు పెట్టేస్తున్నారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించాలని పట్టుబ‌డుతున్నారు.

ఒకప్పుడు చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళలో తమ పిల్లలను చేర్చేవారే కాదు. అప్పులు చేసైనా సరే తమ పిల్లలను ప్రైవేటు లేదా కార్పొరేటు స్కూళ్ళల్లోనే చేర్చేవారు. అలాంటిది జగన్ అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థ‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టడం, విద్యాకానుక కిట్లను అందించటం, గోరుముద్ద పథకం, అమ్మఒడి, నాడు-నేడు పథకంలో స్కూళ్ళ రూపురేఖలు మార్చేస్తుండటం వంటి కారణాలతో పిల్లలు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ స్కూళ్ళ వైపు చూస్తున్నారు.

ఇదే సమయంలో టీచర్లు కూడా కష్టపడి పిల్లలకు పాఠాలు చెబుతుండటంతో పాస్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతోంది. ప్రైవేటు స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఫలితాలు పెరుగుతున్నాయి. మొన్నటి 10వ తరగతి ఫలితాల్లో అయితే ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్ధులకే ఎక్కువ ర్యాంకులొచ్చాయి. స్టేట్ మొదటి ర్యాంకర్‌గా నిలిచింది కూడా ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థినే కావటం గమనార్హం.

నాడు-నేడు కార్యక్రమంతో ఎవరూ ఊహించని విధంగా వేలాది స్కూళ్ళ రూపురేఖలు మారిపోయాయి. వేలాది స్కూళ్ళల్లో పనులు జరుగుతున్నాయి. ప్రతి స్కూలుకు కాంపౌండ్ వాల్, మంచినీటి సౌకర్యం, బాత్ రూంలు, ప్రతి క్లాసులో కూర్చోవటానికి మంచి బెంచీలు, కుర్చీలు, పాఠాలు చెప్పటానికి వీలుగా ఇంటర్నెట్ సౌకర్యంతో డిజిటల్ బోర్డులు, గార్డెన్లు డెవలప్ చేయటంతో అందరు ప్రభుత్వ స్కూళ్ళకు ఎట్రాక్ట్‌ అవుతున్నారు. దానికి అదనంగా మంచి ఫలితాలు కూడా వస్తుండటంతో అడ్మిషన్ల కోసం డిమాండ్ పెరిగిపోయింది. రాష్ట్రంలోని 2015 మున్సిపల్ స్కూళ్ళల్లో చాలా స్కూళ్ళలో అడ్మిషన్లకు నో వేకెన్సీ బోర్డులు పెట్టేశారు. పంచాయితీ స్కూళ్ళలో ఇదే పరిస్థితే కనబడుతోంది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయితే కానీ ఎంతమంది విద్యార్ధులు చేరారు, చదువుతున్నారన్న లెక్క తేలదు.

First Published:  26 Jun 2023 5:38 AM GMT
Next Story