Telugu Global
Andhra Pradesh

కాపీ కొట్టి ట్వీట్ చేసి ఇంత క‌ల‌రింగా..? గంటాపై సెటైర్లు

ఇప్పుడు దాన్నే కాపీ చేసి ఫొటోలు, ప‌దాలు మార్చి పోస్ట‌ర్ క్రియేట్ చేసిన‌ట్లు క‌ల‌రిచ్చారు. ఇదంతా గంటా అండ్ టీమ్ క్రియేటివిటీ అన్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్నారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి..

కాపీ కొట్టి ట్వీట్ చేసి ఇంత క‌ల‌రింగా..? గంటాపై సెటైర్లు
X

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తాజాగా చేసిన ట్వీట్‌కు టీడీపీ, దాని అనుకూల మీడియా విస్తృత ప్ర‌చారం చేశాయి. `వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్` అని వైసీపీ చేప‌ట్టిన కొత్త కార్య‌క్రమానికి కౌంట‌ర్‌గా ``వై ఏపీ హేట్స్ జ‌గ‌న్`` అంటూ ఓ పోస్ట‌ర్‌తో గంటా ట్వీట్ చేశారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ ఫొటో పెట్టి చుట్టూ ఆయ‌న హ‌యాంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులంటూ ర‌క‌ర‌కాల ప‌దాల‌తో డిజైన్ చేసిన ఆ పోస్ట‌ర్‌ను గంటా, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు.

అది కేసీఆర్ యాడ్‌కు కాపీ క‌దా!

అయితే ఈ పోస్ట‌ర్‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఓ వారం కింద‌ట కేసీఆర్ ఫొటో మ‌ధ్య‌లో పెట్టి ఆయ‌న ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌న్నీ చుట్టూ రాసి ప‌త్రిక‌ల్లో ఇచ్చిన యాడ్ గుర్తుకురావ‌డం ఖాయం. ఇప్పుడు దాన్నే కాపీ చేసి ఫొటోలు, ప‌దాలు మార్చి పోస్ట‌ర్ క్రియేట్ చేసిన‌ట్లు క‌ల‌రిచ్చారు. ఇదంతా గంటా అండ్ టీమ్ క్రియేటివిటీ అన్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్నారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి..


ప్ర‌చారంలో మాత్రం కింగే

ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నుకుంటే ఆ పార్టీలో జంప్ అయిపోవ‌డానికి ఏ మాత్రం సంకోచించ‌ని నేత‌గా గంటా శ్రీ‌నివాస‌రావుకు తెలుగు రాష్ట్రాల్లో పేరుంది. ఓ ద‌శ‌లో టీడీపీ కార్య‌క్రమాల‌న్నింటికీ దూరంగా పార్టీని వీడిపోతారేమో అన్న‌ట్లుగా ఉన్న గంటా మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌స్తుందేమెన‌న్న ఆశ‌తో యాక్టివ్ అయ్యారు. అప్ప‌టి నుంచి అధినేత కంట్లో ప‌డేందుకు త‌న ప్ర‌చార క‌ళ‌ల‌న్నీ బ‌య‌టికి తీస్తున్నారు. దానిలో భాగ‌మే ఈ తాజా కాపీ పోస్ట‌ర్‌.

First Published:  16 Nov 2023 6:15 AM GMT
Next Story