Telugu Global
Andhra Pradesh

రామోజీకి నెటిజన్లు వాతలు పెడుతున్నారా..?

డబ్బులు లేకపోయినా ఇమేజి ఉన్న వాళ్ళని పోటీచేయిస్తే జనాలు ఓట్లేస్తారని వైసీపీ తరఫున పోటీచేసిన ఇద్దరు ముగ్గురు విషయంలో నిరూపణయ్యింది.

రామోజీకి నెటిజన్లు వాతలు పెడుతున్నారా..?
X

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులు అనూహ్యంగా ఉంటున్నాయి. ఈ మార్పులను పార్టీలో వాళ్ళే ఊహించలేకపోతున్నారు. కాబట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు అసలు అంచనాలకు కూడా అంద‌డం లేదు. ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చని వారి ఊహకు కూడా రావటంలేదు. వీళ్ళిద్దరూ ఎంతసేపు డబ్బులున్న ఆసాములు, పారిశ్రామికవేత్తలవైపే చూస్తున్నారు. ఎన్నికలన్నాక డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందన్న విషయం తెలిసిందే.

అయితే డబ్బులు లేకపోయినా ఇమేజి ఉన్న వాళ్ళని పోటీచేయిస్తే జనాలు ఓట్లేస్తారని వైసీపీ తరఫున పోటీచేసిన ఇద్దరు ముగ్గురు విషయంలో నిరూపణయ్యింది. ఇదంతా ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో జగన్ టికెట్లు ఇచ్చిన ఇద్దరి వివరాలు బయటపడ్డాయి. దాంతో జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. అనంతపురం జిల్లాలోని మకడశిర, శింగనమల నియోజకవర్గాల్లో జగన్ ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మకడశిరలో జగన్ టికెట్ ఇచ్చింది ఈర లక్కప్పకు. ఈ లక్కప్ప గుడిబండ గ్రామానికి సర్పంచ్‌గా చేశారు.

1989-99 వరకు ఒక స్వచ్ఛంద సంస్థ‌ నడిపిన స్కూల్లో టీచర్‌గా పనిచేశారు. వైసీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గా కూడా పనిచేశారు. లక్కప్పకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఏకగ్రీవంగా తీర్మానించి జగన్ కు పంపారు. లక్కప్పపై సర్వే చేయించుకున్న జగన్ వెంటనే అత‌న్ని ఎంపికచేశారు. సర్పంచ్ గా పనిచేసిన, స్వచ్చంద సంస్థ‌ నడిపే స్కూల్లో టీచర్ గా పనిచేశాడంటేనే లక్కప్ప ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థ‌మైపోతోంది. ఇక శింగనమల నియోజకర్గంలో అభ్యర్థిగా ఎంపికచేసిన ఎం. వీరాంజనేయులు ఆర్థిక పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందట. ఈ ఇద్దరి టికెట్ల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది.

ఒకవైపు ఎల్లోమీడియాలో దళితులను జగన్ తొక్కేస్తున్నారని, టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం చేస్తున్నాడంటూ ప్రతిరోజు టన్నుల కొద్ది బురదచల్లేస్తున్నారు. లక్కప్ప, వీరాంజనేయులు లాంటి అభ్యర్థులకు టికెట్లను టీడీపీ, జనసేనలో ఊహించనుకూడా లేరు. పనిలోపనిగా జగన్ పైన ఈనాడులో వస్తున్న వార్తలు, కథనాలపై నెటిజన్లు రామోజీ టార్గెట్ గా దుమ్ము దులిపేస్తున్నారు.

First Published:  21 Jan 2024 4:52 AM GMT
Next Story