Telugu Global
Andhra Pradesh

రజినీ వ్యవహారంపై మాట్లాడేందుకు సాయంత్రమైనా సమయం సరిపోదు.. మోహన్ బాబు కామెంట్స్

తానిప్పుడు ఎలాంటి వివాదాలకి జోలికి వెళ్ళబోనని మోహన్ బాబు చెప్పారు. రజినీకాంత్‌ వ్యవహారంలో ఆయ‌న ఇచ్చిన సమాధానానికి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోయారు.

Mohan Babu: రజినీ వ్యవహారంపై మాట్లాడేందుకు సాయంత్రమైనా సమయం సరిపోదు.. మోహన్ బాబు కామెంట్స్
X

రజినీ వ్యవహారంపై మాట్లాడేందుకు సాయంత్రమైనా సమయం సరిపోదు.. మోహన్ బాబు కామెంట్స్

కొద్దిరోజుల కిందట తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను వైసీపీ నేతలు టార్గెట్‌గా చేసుకొని తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయన స్నేహితుడు మోహన్ బాబు స్పందిస్తారని అంతా భావించారు. అయితే ఆయన మాత్రం నోరు విప్పలేదు. ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి అతిథిగా రజినీకాంత్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూ మాట్లాడారు. ఈ ప్రసంగం తర్వాత రజినీ వైసీపీ నేతలకు టార్గెట్‌గా మారారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన నువ్వు కూడా వెన్నుపోటుదారుడివే అంటూ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, రోజా రజినీకాంత్‌ను తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నేతలకు కౌంటర్‌గా ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా వేలాదిగా పోస్ట్ లు చేశారు. రజినీకాంత్‌ను లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతలు విమర్శిస్తున్న సమయంలో ఆయన స్నేహితుడైన‌ మోహన్ బాబు కౌంటర్ ఇస్తారని అంతా భావించారు. అయితే ఈ వ్యవహారంపై మోహన్ బాబు నోరు విప్పలేదు.

తాజాగా ఆయన ఈ విషయం గురించి స్పందించారు. ఇవాళ మోహన్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏపీలో రజినీకాంత్‌ను వైసీపీ నేతలు విమర్శించడంపై స్పందించాలని మీడియా కోరగా.. రజినీకాంత్ వ్యవహారంపై మాట్లాడాలంటే సాయంత్రమైనా సమయం సరిపోదని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అయినా తానిప్పుడు ఎలాంటి వివాదాలకి జోలికి వెళ్ళబోనని చెప్పారు. కాగా, రజినీ వ్యవహారంలో మోహన్ బాబు ఇచ్చిన సమాధానానికి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోయారు.

వివాదాల్లో తల దూర్చడం మోహన్ బాబుకు కొత్తేమీ కాదు. గతంలో ఆయన మాట్లాడిన మాటలకు ఎన్నో వివాదాలు చెలరేగాయి. పైగా మోహన్ బాబుకు ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరుంది. అటువంటి మోహన్ బాబు ఇప్పుడు రజినీ వ్యవహారం గురించి పెద్దగా స్పందించికపోవడం ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా తానిప్పుడు వివాదాల జోలికి వెళ్ళబోను అని.. మోహన్ బాబు ఇచ్చిన సమాధానం చూసి రజినీకాంత్ ఫ్యాన్స్ సైతం నివ్వెరపోయారు.

First Published:  1 Jun 2023 7:40 AM GMT
Next Story