Telugu Global
Andhra Pradesh

రేవంత్‌ రెడ్డి శిక్ష అనుభవించాల్సిందే - ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఓటుకు నోటు కేసులో మనవాడు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్‌ చంద్రబాబుదేనని FSI ల్యాబ్ ద్వారా ధృవీకరించిన పేపర్స్ ఉన్నాయన్నారు ఆర్కే. రేవంత్‌ రెడ్డి స్వయంగా ఆడియో, వీడియోలో దొరికిపోయరన్నారు.

రేవంత్‌ రెడ్డి శిక్ష అనుభవించాల్సిందే - ఆళ్ల రామకృష్ణారెడ్డి
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. షర్మిల కాంగ్రెస్‌కు వర్క్ చేయబోతున్నారు.. షర్మిల వెంట నడుస్తానని మీరు చెప్తున్నారు కదా.. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో మీ కేసులో వాపస్‌ తీసుకుంటారా..? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆళ్ల స్పందించారు. అలాంటిదేం ఉండదన్నారు ఆర్కే.


ఓటుకు నోటు కేసులో మనవాడు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్‌ చంద్రబాబుదేనని FSI ల్యాబ్ ద్వారా ధృవీకరించిన పేపర్స్ ఉన్నాయన్నారు ఆర్కే. రేవంత్‌ రెడ్డి స్వయంగా ఆడియో, వీడియోలో దొరికిపోయరన్నారు. ముఖ్యమంత్రి అయితే ఏం గొప్ప కాదన్నారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారన్నారు. న్యాయస్థానానికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి తేడాలు ఉండవన్నారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలంటూ గతంలో సుప్రీంకోర్టులో కేసు వేశారు ఆళ్ల‌ రామకృష్ణారెడ్డి. ఇదే కేసులో ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఇక ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తన భవిష్యత్‌ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

First Published:  30 Dec 2023 8:41 AM GMT
Next Story