Telugu Global
Andhra Pradesh

చంద్రబాబూ.. రాళ్లు వేయించుకుంటే ఓట్లు పడవు

చంద్రబాబుపై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజలు చిత్తుగా ఓడించారు. ఆ గతాన్ని బాబు గుర్తు తెచ్చుకోవాలి. రాళ్ల దాడిలో సీఎం జగన్, ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయమైంది. కానీ, చంద్రబాబుకు ఇవేం కనిపించడం లేదా?.

చంద్రబాబూ.. రాళ్లు వేయించుకుంటే ఓట్లు పడవు
X

సీఎం జగన్‌పై దాడి కేసులో చంద్రబాబు, లోకేష్‌ నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జనాల్లో సీఎం జగన్‌పై సానుభూతి ఎక్కడ పెరిగిపోతుందో అనే ఆందోళన టీడీపీలో మొదలైందన్నారు. కానీ, సింపథీతో జనాలు ఓట్లేయరని, ఆ విషయం చంద్రబాబుకు కూడా అనుభవపూర్వకంగా తెలుసంటూ చురకలంటించారు. తిరుపతిలో పర్యటిస్తున్న పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

పెద్దిరెడ్డి ఏమన్నారంటే.. "చంద్రబాబు తన మీద రాళ్లు వేయించుకుని సింపథీతో గెలుద్దామని అనుకుంటున్నారు. కానీ, సింపథీతో ఓట్లు రావు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశారు. చంద్రబాబుపై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజలు చిత్తుగా ఓడించారు. ఆ గతాన్ని బాబు గుర్తు తెచ్చుకోవాలి. రాళ్ల దాడిలో సీఎం జగన్, ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయమైంది. కానీ, చంద్రబాబుకు ఇవేం కనిపించడం లేదా?. అయినా కూడా నాపై రాళ్ళ దాడి జరిగింది అంటూ చంద్రబాబు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు".

"చంద్రబాబు వయసుకు తగ్గట్లు మాట్లాడటం లేదు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి. కానీ, చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టండి అంటూ చంద్రబాబే పిలుపు ఇచ్చారు. చంద్రబాబు దగ్గర మంచి పేరు కోసం టీడీపీ వాళ్లే సీఎం జగన్‌పైకి రాళ్లు విసిరాయి. చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయాల్ని ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందిస్తూ అండగా ఉంటే.. ప్రజలు నేతలపై నమ్మకం ఉంచుతారు. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటనను ఇప్పుడు ప్రజలంతా ఖండిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే పరామర్శకు రావాల్సింది పోయి చంద్రబాబు ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారు" అంటూ నిప్పులు చెరిగారు పెద్దిరెడ్డి.

First Published:  15 April 2024 6:12 AM GMT
Next Story