Telugu Global
Andhra Pradesh

క్యాష్ ట్రాన్స్ ఫర్ అయింది.. మా క్యాస్ట్ ఓట్ ట్రాన్స్ ఫర్ కాదు

పవన్ బ్యాచ్, కాపు సోదరులంతా.. మా పవన్ కల్యాణ్ సీఎం సీఎం అంటూ గోల చేస్తున్నారని, కానీ పవన్ మాత్రం చంద్రబాబు సీఎం అంటున్నారని.. ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు మంత్రి అంబటి.

క్యాష్ ట్రాన్స్ ఫర్ అయింది.. మా క్యాస్ట్ ఓట్ ట్రాన్స్ ఫర్ కాదు
X

టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అది వారి జామకాయ అని.. దాన్ని వారు దేనిలోనైనా ముంచుకొని తినొచ్చని సెటైర్లు పేల్చారు. అసలు కలవడానికి వారికి సిద్ధాంతాలంటూ ఉన్నాయా అని ప్రశ్నించారాయన. పవన్ కల్యాణ్ కి క్యాష్ ట్రాన్స్ ఫర్ అయిందని, అయితే తమ క్యాస్ట్ ఓట్ మాత్రం చంద్రబాబుకి ట్రాన్స్ ఫర్ కాదని ఇది నిజం అని చెప్పారు అంబటి.

పవన్ బ్యాచ్, కాపు సోదరులంతా.. మా పవన్ కల్యాణ్ సీఎం సీఎం అంటూ గోల చేస్తున్నారని, కానీ పవన్ మాత్రం చంద్రబాబు సీఎం అంటున్నారని.. ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు మంత్రి అంబటి. ఇంతకీ సీఎం చంద్రబాబా, లోకేషా అని అడిగారు. సీఎం పోస్ట్ వద్దు అని పవన్ కల్యాణ్ అంటున్నారంటే ప్యాకేజీ ముట్టినట్టేకదా అని అన్నారు. క్యాష్ ట్రాన్స్ ఫర్ జరిగినట్టు రుజువు అదేనని చెప్పారు అంబటి.

మేము సిద్ధం.. మా పోలింగ్ బూత్ సిద్ధం..

ఈరోజు వైసీపీ నేతల కీలక సమావేశం మంగళగిరిలో జరుగుతోంది. మేము సిద్ధం.. మా పోలింగ్ బూత్ సిద్ధం.. అనే పేరుతో జరుగుతున్న ఈ సభకు నేతలంతా హాజరయ్యారు. రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే విషయాన్ని సీఎం జగన్ ఉపదేశించబోతున్నారు. ఈ మీటింగ్ తర్వాత వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో పిచ్చికలగుడిపాడులో ‘సిద్ధం’ చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుడతారు.

First Published:  27 Feb 2024 11:19 AM GMT
Next Story