Telugu Global
Andhra Pradesh

భువనేశ్వరిని వివరాలు అడిగిన లక్ష్మీపార్వతి

2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే 400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పిన భువనేశ్వరి.. ఆ ఖర్చుల కోసం ఎన్ని షేర్లు అమ్మారో తెలపాలంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

భువనేశ్వరిని వివరాలు అడిగిన లక్ష్మీపార్వతి
X

చంద్రబాబు అరెస్ట్ తర్వాత లక్ష్మీపార్వతి వార్తల్లో వ్యక్తిగా మారారు. బాబు విషయంలో ఆమె విమర్శలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆమె భువనేశ్వరికి ఓ ప్రశ్న సంధించారు. చంద్రబాబు లాయర్లకు ఇస్తున్న ఫీజు వివరాలు, ఆ డబ్బు ఎక్కడినుంచి తెస్తున్నారో చెప్పాలన్నారు. 2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే 400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పిన భువనేశ్వరి.. చంద్రబాబు లాయర్ల ఖర్చుకోసం ఎన్ని షేర్లు అమ్మారో తెలపాలంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.



లాయర్ల జమా ఖర్చులు..

చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్ముకంటే.. బెయిల్ కోసం లాయర్లకు పెట్టిన ఖర్చు ఎక్కువంటూ ఇటీవల వైసీపీ కూడా సెటైర్లు పేలుస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి కూడా అదే విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. చంద్రబాబు లాయర్ల ఖర్చుని ఆమె లెక్క కట్టారు. 40రోజులుగా చంద్రబాబు కోసం 19మంది లాయర్లు పనిచేస్తుంటే అందులో 16మంది పేర్లు మాత్రమే బయటపెట్టారని అన్నారు లక్ష్మీపార్వతి. పోనీ 16మంది లాయర్లనే పరిగణలోకి తీసుకుంటే రోజుకి అన్ని ఖర్చులు కలుపుకొని ఒక్కొకరికి 3 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని. ఆ లెక్కన 40రోజులకు 16మందికి రోజుకి 3కోట్ల చొప్పున 1920కోట్ల రూపాయలు అవుతుందని లెక్క తేల్చారు. ఈ సొమ్ము ఎక్కడి నుంచి చెల్లిస్తున్నారని ప్రశ్నించారు.

లాయర్లకు వేల కోట్ల రూపాయల ఫీజులు చెల్లించడానికి... చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు లక్ష్మీ పార్వతి. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్‌ ఢిల్లీలో మకాం పెట్టారా అని సందేహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడనే సందేహం కలుగుతోందన్నారు. పచ్చ మీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఇందిరాగాంధీ కూడా తన కేసులను వాదించడానికి ఇద్దరు లాయర్లనే పెట్టుకున్నారని గుర్తు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ కి కూడా ఇంతమంది లాయర్లు ఉండరన్నారు లక్ష్మీపార్వతి.


First Published:  20 Oct 2023 10:34 AM GMT
Next Story