Telugu Global
Andhra Pradesh

పవన్‌ని టీడీపీనే ఓడిస్తుంది.. - మాజీ మంత్రి కొడాలి నాని

ఒక్కడే ఎన్నికల బరిలో వస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు.. దత్తపుత్రుడు పవన్, మోడీ, టీవీ–5, పౌడర్‌ డబ్బా వంటి వారిని వెంట వేసుకుని వస్తున్నాడని ధ్వజమెత్తారు.

పవన్‌ని టీడీపీనే ఓడిస్తుంది.. - మాజీ మంత్రి కొడాలి నాని
X

వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ని టీడీపీ నేతలే ఓడిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ విషయంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌ వంటి గుంటనక్కలతో పవన్‌ ప్రయాణం చేస్తున్నాడని, ఎవరు ఎప్పుడు ఎలా పొడుస్తారో చెప్పలేని పరిస్థితి అని తెలిపారు. పవన్‌ను కాపాడుకోవాల్సిన అవసరం జనసైనికులు, అభిమానులకు ఉందని ఆయన చెప్పారు.

రాజమండ్రిలో సోమవారం ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభలో కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను ఓడించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ వ్యూహం పన్నుతున్నారంటూ బాబు, ఆయన అనుకూల మీడియా డప్పు కొడుతున్నారని, కానీ రాష్ట్రంలోని 175 సీట్లలోనూ వైసీపీ గెలవాలన్నది సీఎం జగన్‌ ఉద్దేశమని ఆయన చెప్పారు. ఓడే వాళ్లలో బాబు, పవన్, లోకేశ్‌ కూడా ఉండవచ్చన్నారు. ఒక్కడే ఎన్నికల బరిలో వస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు.. దత్తపుత్రుడు పవన్, మోడీ, టీవీ–5, పౌడర్‌ డబ్బా వంటి వారిని వెంట వేసుకుని వస్తున్నాడని ధ్వజమెత్తారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 30 స్థానాలిచ్చిన చంద్రబాబు.. 20 శాతం ఉన్న కాపులకు మాత్రం 24 సీట్లే ఇచ్చాడని దుయ్యబట్టారు. ఇవ్వడానికి చంద్రబాబుకు.. తీసుకునేందుకు పవన్‌కు సిగ్గుండాలని విమర్శించారు.

ఐ-ప్యాక్‌ నుంచి ప్రశాంత్‌కిశోర్‌ని తన్ని తరిమేశారు..

ప్రశాంత్‌ కిశోర్‌ లాంటివారు డబ్బులు తీసుకుని వాగే చిల్లర వాగుడును పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని చెప్పారు. గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐ-ప్యాక్‌ నుంచి తన్ని తరిమేసిన తర్వాత ఏ పార్టీ అతన్ని చేరదీయకపోతే తీసేసిన తహసీల్దార్లాగా బిహార్‌లో సొంత పార్టీ పెట్టి ఫలితం లేక డిజాస్టర్‌ అయిపోయాడన్నారు. ప్రశాంత్‌ని ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు లాంటి పనికి మాలిన వ్యక్తుల వద్ద ప్యాకేజ్‌ తీసుకుని జ్యోతిష్యం చెపుతున్నాడన్నారు. ఐ-ప్యాక్‌ టీమ్‌ ఇప్పటికీ వైసీపీకి పనిచేస్తోందన్నారు.

First Published:  5 March 2024 5:22 AM GMT
Next Story